రోడ్ల వెంట విరివిగా కనిపించే ఈ చెట్టు ఆకులు.. మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తాయి..

|

Jul 20, 2023 | 5:50 PM

అలాగే జుట్టు రాలడం ఆగిపోయి ఒత్తుగా మారుతుంది. చిన్న వయసులో తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారు ఈ నూనెను క్రమం తప్పకుండా వాడాలి. ఈ నూనెలోని ఔషధ గుణాలు తెల్ల వెంట్రుకలను శాశ్వతంగా నల్లగా మారుస్తాయి.

రోడ్ల వెంట విరివిగా కనిపించే ఈ చెట్టు ఆకులు.. మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తాయి..
White Hair Turn Black
Follow us on

ఆధునిక జీవనశైలి, కాలుష్యం కారణంగా ఇప్పుడు చాలా మందిలో చిన్న వయసులోనే తెల్లజుట్టు సమస్య మొదలవుతుంది. తెల్ల జుట్టును తిరిగి నల్లగా మార్చుకోవటానికి అనేక రకాల రసాయన రంగులను ఉపయోగిస్తుంటారు కొందరు. అయితే, ఇలాంటి రసాయన రంగుల వాడకం ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి, ఇలాంటి సహజ పద్ధతిని అనుసరించటం వల్ల దుష్పప్రభావల బారినపడకుండా ఉంటారని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఇంట్లోనే ఉంటూ తెల్ల జుట్టుకు చికిత్స: జుట్టు రాలిపోయే సమస్యతో బాధపడేవారు అనేక జాగ్రత్తలు పాటించాలి. అలాగే రోజూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. అంతే కాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు చిట్కాలను పాటించడం ద్వారా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. జుట్టు రాలటం, జుట్టు రంగు నెరిసి పోవటం వంటి సమస్యలకు వేప దివ్యౌషధం అంటున్నారు నిపుణులు. అందుకోసం వేప ఆకులను నీళ్లలో వేసి బాగా మరిగించి..ఆ నీటితో తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. క్రమంగా జుట్టు రంగు కూడా మారుతుంది. జుట్టు రాలడం మరియు నెరిసిన జుట్టు సమస్యతో బాధపడేవారు రోజూ వేప ఉత్పత్తులను తీసుకోవాలి. దీని లక్షణాలు తీవ్రమైన జుట్టు సమస్యలను దూరం చేస్తాయి.

జుట్టు రాలడం, చుండ్రు సమస్యతో బాధపడేవారు రోజూ కెమికల్ ఆధారిత ఉత్పత్తులను వాడే బదులు ఆయుర్వేద గుణాలున్న వేప షాంపూ వాడితే మంచి ఫలితాలు పొందవచ్చు. వేప ఆకుల పేస్టును జుట్టుకు పట్టించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే జుట్టు రాలడం ఆగిపోయి ఒత్తుగా మారుతుంది. చిన్న వయసులో తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారు వేపనూనెను క్రమం తప్పకుండా వాడాలి. ఈ నూనెలోని ఔషధ గుణాలు తెల్ల వెంట్రుకలను శాశ్వతంగా నల్లగా మారుస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..