Toothbrush: పళ్లుతోమేందుకు ఎలాంటి టూత్‌బ్రష్‌ వాడుతున్నారు? ఇలాంటి బ్రష్‌లు వాడారంటే మీ పళ్లు త్వరలోనే..

|

Oct 31, 2022 | 9:30 PM

దంతాలు శుభ్రపరచుకోవడానికి మన పూర్వికులు వేప పుల్లలు, బొగ్గు వంటి వాటిని వినియోగించేవారు. కాలక్రమంలో టూత్ బ్రష్‌ల వాడటం మొదలైంది. ఇక నేటి కాలంలో పళ్లు శుభ్రం చేసుకోవడానికి పల్లె, పట్నం తేడా లేకుండా..

Toothbrush: పళ్లుతోమేందుకు ఎలాంటి టూత్‌బ్రష్‌ వాడుతున్నారు? ఇలాంటి బ్రష్‌లు వాడారంటే మీ పళ్లు త్వరలోనే..
How to choose the right toothbrush
Follow us on

దంతాలు శుభ్రపరచుకోవడానికి మన పూర్వికులు వేప పుల్లలు, బొగ్గు వంటి వాటిని వినియోగించేవారు. కాలక్రమంలో టూత్ బ్రష్‌ల వాడటం మొదలైంది. ఇక నేటి కాలంలో పళ్లు శుభ్రం చేసుకోవడానికి పల్లె, పట్నం తేడా లేకుండా ప్రతిఒక్కరూ బ్రష్‌లను ఉపయోగించడం పరిపాటైపోయింది. పళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం, రాత్రి పడుకునే ముందు.. ఇలా రోజుకు రెండు సార్లు బ్రష్‌ చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఐతే మార్కెట్లో రకరకాల టూత్‌ బ్రష్‌లు ఉంటాయి. వీటిల్లో ఏది మంచిది? ఎలాంటి బ్రష్‌లను ఎంచుకోవాలనే విషయాలపై చాలా మంది శ్రద్ధ వహించరు. ఆ వివరాలు మీ కోసం..

టూత్ బ్రష్‌లను కొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దంతాలు, చిగుళ్ళకు చాలా హాని కలుగుతుంది. ఏ బ్రష్‌ అయితేనేమి.. ఏదైనా పళ్లు తోమేందుకే కదా! అనే భావనతో తక్కువ ధరకు వచ్చేటూత్ బ్రష్‌లను చాలా మంది కొంటుంటారు. ఇలాంటి బ్రష్‌ల వల్ల దంతాలు, చిగుళ్లు దెబ్బతింటాయని చాలా మందికి తెలియదు. ఒక వేళ అధిక ధరలో దొరికే టూత్ బ్రష్‌ కొనుగోలు చేసినా.. దాని నాణ్యతను పరీక్షించడం మరచిపోకూడదు. ఎల్లప్పుడూ మృదువైన పళ్లు ఉండే టూత్ బ్రష్‌లను మాత్రమే ఎంచుకోండి. గట్టిగా ఉండే పళ్లతో బ్రష్‌ చేసుకుంటే నోటిలోపలి చర్మం గాయపడి, చిగుళ్ళ నుంచి రక్తస్రావం, చిగుళ్ల నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా దంతాలకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు గట్టిగా ఉండే టూత్ బ్రష్‌లను అస్సలు ఉపయోగించకూడదు. ఈ రోజుల్లో మార్కెట్‌లో రబ్బర్ గ్రిప్‌లతో కూడిన అనేక రకాల టూత్ బ్రష్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే.. పట్టుకోవడానికి అనుగుణంగా ఉండటం మాత్రమేకాకుండా, దంతాలను కూడా మృదువుగా శుభ్రపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.