
సైబర్ కాండ్రియా అంటే.. అదేదో చిన్న భయం లాంటిది కాదు. ఇదొక మానసిక సమస్య అని సైకాలజిస్టులు చెప్తున్నారు. భయమే చాలామందిని రోగాల బారిన పడేలా చేస్తుంది. సైబర్ కాండ్రియా వల్ల స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి సమస్యలు వస్తాయంటున్నారు. ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్స్‌కి వచ్చేవాళ్లలో ముప్పై శాతం మంది అనవసరమైన భయాలతోనే వస్తున్నారని సర్వేలు చెప్తున్నాయి. మామూలు లక్షణాలకు కూడా పెద్దపెద్ద జబ్బులేమో అనే భయపడడం, కాదని డాక్టర్లు కన్ఫర్మ్ చేసినా ఆ భయాలు వెంటాడుతునే ఉండడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఏయే లక్షణాలు సైబర్ కాండ్రియా కిందకు వస్తాయంటే..
మూడు గంటల కంటే ఎక్కువ స్క్రీన్ టైం ఉన్నవాళ్లు ఇంటర్నెట్‌లో ఏది ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారో గమనించుకోవాలి. రెగ్యులర్‌గా చూసే యూట్యూబ్ వీడియోలు, తరచూ వాడే యాప్‌లు, గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసే విషయాలు ఒకసారి చెక్ చేసుకోవాలి. వాటిలో హెల్దీ హ్యాబిట్స్, ఫిట్‌నెస్ వీడియోలు ఉంటే పర్వాలేదు. కానీ మీకు వచ్చే సింప్టమ్స్ సెర్చ్ చేసే అలవాటు ఉంటే సైబర్ కాండ్రియా బారిన పడే ప్రమాదముంది.
ఆరోగ్యం మీద అందరికీ శ్రద్ధ ఉంటుంది. కానీ ‘ఆ శ్రద్ధ ఎంత వరకు?’ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. తరచూ వస్తున్న సమస్యల గురించి , శరీరంలో వస్తున్న మార్పుల గురించి కేర్ తీసుకుని, లైఫ్‌స్టైల్‌లో మార్పులు చేసుకోవడం మంచి హ్యాబిట్. అలా కాకుండా ఏ చిన్న సమస్య వచ్చినా దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఆత్రుత పడడం, ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయడం లాంటి భయాలు ఉన్నట్టయితే సైబర్ కాండ్రియాకు దగ్గర్లో ఉన్నట్టే.
కొంత మందికి ప్రతిదానికి హాస్పిటల్‌కు వెళ్లడం ఇష్టం ఉండదు. ఎవరో ఒకరి సలహా అడిగో లేదా ఇంటర్నెట్‌లో వెతికో సొంతగా ట్రీట్‌మెంట్ తీసుకుంటారు. ఆ క్రమంలో రెండు, మూడు సార్లు ఇంటర్నెట్‌లో ఏదైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తే.. అంతే సంగతి. లేనిపోని వ్యాధుల భయాలు పట్టుకుంటాయి. ఈ భయాలే మెంటల్ ఇల్‌నెస్‌కు దారి తీస్తాయి. ఇది కూడా సైబర్ కాండ్రియా కిందకే వస్తుంది.
జాగ్రత్తలు ఇలా..
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)