
నేటి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఖరీదైన మాత్రలు వేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కానీ వ్యాధుల నుంచి దూరంగా ఉండటానికి ఇంట్లో లభించే సహజ పదార్థాలను ప్రయత్నించవచ్చు. ఇటువంటి అద్భుతమైన ఆహారాల్లో వంటింట్లోని వెల్లుల్లి, తేనె మిశ్రమం. వీటితో తయారు చేసిన ఆయుర్వేద రెసిపీని సరిగ్గా పాటిస్తే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది ఎలాంటి ఆరోగ్య సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..
వెల్లుల్లి, తేనె రెండింటిలోనూ యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం వీటిని తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా జలుబు, గొంతు నొప్పి, తరచుగా వచ్చే జ్వరాలు వంటి సమస్యల నుంచి రక్షణపొందొచ్చు.
వెల్లుల్లి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో కూడా సహాయపడుతుంది. అంతే కాదు గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. తేనెలో ఉండే మంచి బ్యాక్టీరియా కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఈ మిశ్రమం సహజమైన కఫహరమైనదిగా పనిచేస్తుంది. ఇది శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. సైనస్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. దీనితో పాటు తేనె గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది.
వెల్లుల్లి గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తాన్ని పలుచబరిచి రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది.
తేనె తక్షణ శక్తిని ఇస్తుంది. వెల్లుల్లి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరానికి ఆక్సిజన్ సరఫరా చేయడంలో సహాయపడుతుంది. ఈ రెండింటిలోనూ ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇవి వృద్ధాప్య ప్రక్రియను కూడా నెమ్మదింపజేస్తాయి. గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి శుభ్రం చేసి, శుభ్రమైన గాజు కూజాలో ఉంచాలి. వెల్లుల్లి రెబ్బలు పూర్తిగా మునిగిపోయేలా వాటిపై తేనె పోయాలి. కూజాను మూతతో మూసివేసి 7 నుండి 10 రోజులు అలాగే ఉంచాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఒకటి, రెండు వెల్లుల్లి రెబ్బలను తిరాలి. అయితే దీనిని పిల్లలు, మధుమేహం ఉన్నవారు తీసుకోకూడదు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.