బాబోయ్‌.. నీళ్లు ఎక్కువ తాగినా నష్టమేనండోయ్..! ఈ విషయం తప్పక తెలుసుకోండి..

|

Mar 24, 2025 | 10:08 PM

ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ కారణంగా వాపు, వికారం, వాంతులు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎక్కువ నీళ్లు తాగితే బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. గుండెపై అధిక ఒత్తిడి పడుతుంది. ఛాతిలో నొప్పిగా అనిపిస్తుంది. అతిగా నీళ్లు తాగడం వల్ల కాళ్లలో వాపులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సరిపడా నీరు మాత్రమే తీసుకోండి. మరీ ఎక్కువగా తాగితే సమస్యలు వస్తాయి. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల

బాబోయ్‌.. నీళ్లు ఎక్కువ తాగినా నష్టమేనండోయ్..! ఈ విషయం తప్పక తెలుసుకోండి..
Drinking Water
Follow us on

నీరు ఆరోగ్యానికి చాలా అతి ముఖ్యమైన అవసరం. రోజూ కనీసం 3-5 లీటర్ల నీరు తాగాలని వైద్యులు చెబుతుంటారు. ఇది వారి సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. అయితే కొంతమంది నీళ్లు మరీ ఎక్కువగా తాగుతుంటారు. ఇది సరైనది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయటం వల్ల తీవ్రమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉన్నాయని చెబుతున్నారు. నీళ్లు ఎక్కువగా తాగటం వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటో తెలుసుకుందాం.

ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల కిడ్నీలకు ఇబ్బందికరంగా మారుతుంది. కిడ్నీలు నీళ్లని ఫిల్టర్ చేయలేవు. కిడ్నీలపై అధిక భారం పడుతుంది. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల బాడీ ఎలక్ట్రోలైట్స్ (లవణాలు) కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో ఎలక్ట్రోలైట్ ఇన్ బాలన్స్ జరిగి కండరాల నొప్పులు, కండరాల బలహీనత ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల పదేపదే మూత్ర విసర్జన చేయడం, దాని కారణంగా నిద్ర పట్టకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి.

ఎక్కువ నీళ్లు తాగడం వల్ల సోడియం లెవెల్స్ పడిపోతాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ కారణంగా వాపు, వికారం, వాంతులు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎక్కువ నీళ్లు తాగితే బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. గుండెపై అధిక ఒత్తిడి పడుతుంది. ఛాతిలో నొప్పిగా అనిపిస్తుంది. అతిగా నీళ్లు తాగడం వల్ల కాళ్లలో వాపులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సరిపడా నీరు మాత్రమే తీసుకోండి. మరీ ఎక్కువగా తాగితే సమస్యలు వస్తాయి. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. అజీర్తి, కడుపు ఉబ్బరంతో పాటుగా ముఖ్యమైన పోషకాలని కోల్పోవడం లాంటి ఇబ్బందులు వస్తాయి.

ఇవి కూడా చదవండి

రోజులో ఎంత నీరు తాగాలి?:

రోజుకి 3-5 లీటర్లు నీళ్లు తాగాలి. అంటే 8 నుంచి 12 గ్లాసులు మాత్రమే. లేత పసుపు రంగులో యూరిన్ వస్తే హైడ్రేట్‌గా ఉన్నట్లు అదే ముదురు పసుపు రంగులో మూత్రం వస్తే డీహైడ్రేషన్ బారిన పడినట్లు అర్థం. అలాంటి సమయంలో నీళ్లు ఎక్కువగా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..