పరిశుభ్రత అనేది మనిషికి చాలా అవసరం. పరిశుభ్రంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవిస్తాడని నిపుణులు సైతం చెబుతున్నారు. శుభ్రత అనగానే చాలా మంది ముఖం, చేతులు మాత్రమే అనుకుంటారు. కానీ కాళ్లు, పాదాలు కూడా చాలా ముఖ్యం. పాదాలు కూడా శుభ్రంగా ఉంటేనే మరింత ఆరోగ్యం. అంతే కాకుండా రాత్రి పూట పాదాలు శుభ్రం చేసుకుని పడుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, చాలా వరకు వ్యాధులను నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. మరి రాత్రి పూట పాదాలను శుభ్రం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మనిషికి నిద్ర అనేది చాలా ముఖ్యం. నిద్ర సరిగ్గా ఉంటే సగం వ్యాధులను సైతం తగ్గించుకోవచ్చు. రోజంతా కష్ట పడి రాత్రి పడుకునే సమయంలో సరిగ్గా నిద్ర లేకపోతే.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. మంచి నిద్ర పట్టడంలో ఈ టిప్ కూడా బాగా పని చేస్తుంది. రాత్రి పూట పాదాలను బాగా శుభ్రం చేసి.. మాయిశ్చ రైజర్ లేదా కొబ్బరి నూనెతో కాసేపు మసాజ్ చేసి పడుకుంటే.. హాయిగా నిద్ర పడుతుంది. అంతే కాకుండా కాళ్లపై ఉండే వాపులు, నొప్పులు కూడా తగ్గుతాయి. మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది.
రాత్రి పూట పాదాలను శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. గోరు వెచ్చటి నీటిలో ఉప్పు వేసి కరిగాక అందులో పాదాలను పావుగంట సేపు అయినా ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా వాపులు, నొప్పులు కూడా తగ్గుతాయి.
పాదాలను తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఉప్పు వేసిన నీటిలో పాదాలను ఉంచి కడగటం వల్ల మురికి, క్రిములు వంటివి ఏమన్నా ఉంటే పోతాయి. దీని వల్ల త్వరగా ఇన్ ఫెక్షన్, వైరస్ బారిన పడకుండా ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లల పాదాలకు బ్యాక్టీరియా అనేది ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా శుభ్రం చేయాలి. లేకుండా రక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..