
వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత లేదా పెరిగిన తేమ కారణంగా శరీరాన్ని చల్లగా ఉంచడానికి ఎక్కువ చెమట ఉత్పత్తి అవుతుంది. అధిక చెమట పట్టడానికి ప్రధాన కారణం యాంటీబయాటిక్స్ లేదా నొప్పి నివారణ మందులు వంటి కొన్ని మందులు తీసుకోవడం కావచ్చు. మీరు వ్యాయామం చేసినప్పుడు లేదా ఎక్కువ శారీరక శ్రమ చేసినప్పుడు, మీ శరీరం అదనపు శక్తిని ఖర్చు చేస్తుంది. దీని వలన మీకు ఎక్కువ చెమట పడుతుంది.
కొంతమందికి చెమట ఎక్కువగా పడుతుంది. ఎలాంటి అనారోగ్యం, శారీరక శ్రమ, వేడి లేకుండాచెమటలు పట్టడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఒత్తిడి లేదా ఆందోళన విషయంలో శరీర నాడీ వ్యవస్థ చురుగ్గా మారి చెమటను పెంచుతుంది. చాలా కారంగా, వేడిగా లేదా నూనెతో కూడిన ఆహారం తినడం వల్ల కూడా అధిక చెమట పట్టవచ్చు. కాబట్టి, ఎక్కువ కారంగా ఉండే ఆహారం తినకుండా ఉండండి.
థైరాయిడ్, డయాబెటిస్ లేదా హార్మోన్ల అసమతుల్యత వంటి వైద్య సమస్యలు కూడా అధిక చెమటకు కారణమవుతాయి. అధిక చెమట అనేది ఒక వైద్య పరిస్థితి. దీనిలో శరీరం సాధారణం కంటే ఎక్కువ చెమటను ఉత్పత్తి చేస్తుంది.
(Note: ఈ వ్యాసం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నివేదికలు, సమాచారం ఆధారంగా రూపొందించబడింది. కాబట్టి వీటి గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.