Weight Loss Tips: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీ డైట్‌లో ఈ హెల్దీఫుడ్స్‌ను చేర్చుకోండి..

Weight Loss Tips:బరువు తగ్గడానికి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.ఇందుకోసం బ్రేక్ ఫాస్ట్, లంచ్ తో పాటు డిన్నర్ లో కూడా హెల్తీ ఫుడ్స్ చేర్చుకోవడం ఎంతో అవసరం.

Weight Loss Tips: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీ డైట్‌లో ఈ హెల్దీఫుడ్స్‌ను చేర్చుకోండి..
Weight Loss Tips
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Jun 30, 2022 | 8:50 AM

Weight Loss Tips:బరువు తగ్గడానికి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.ఇందుకోసం బ్రేక్ ఫాస్ట్, లంచ్ తో పాటు డిన్నర్ లో కూడా హెల్తీ ఫుడ్స్ చేర్చుకోవడం ఎంతో అవసరం. ఇక కేలరీలు తక్కువగా ఉన్న ఫుడ్స్‌కు ఎక్కువగా ప్రాధాన్యమివ్వాలి. ఈ ఆరోగ్యకరమైన ఆహారాలు జీవక్రియను వేగవంతం చేయడంలోనూ సహాయపడతాయి. ముఖ్యంగా కూరగాయలు, పండ్లను బాగా తీసుకోవాలి. వీటిని తిన్న తర్వాత చాలా సేపటి వరకు కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. ఫలితంగా అధికంగా తినలేరు. తద్వారా వేగంగా బరువు తగ్గే అవకాశముంది. మరి అలాంటి ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం రండి.

క్యాప్సికమ్

క్యాప్సికమ్‌లో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రకాలున్నాయి. ఇందులో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతాయి. అంతేకాదు వీటిని తింటే చాలా సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో సహాయపడుతాయి. బరువు తగ్గడానికి రాత్రి భోజనంలో క్యాప్సికమ్ తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆకుకూరలు

ఆకుకూరలను డైట్లో చేర్చుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా రాత్రిపూట భోజనంలో బచ్చలికూర తినవచ్చు. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. మినరల్స్, ఐరన్, విటమిన్లు శరీరానికి అందుతాయి. దీనిని జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

అవకాడో

అవకాడో చాలా ఆరోగ్యకరమైన పండు. ఇందులో చాలా తక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. పైగా ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. బరువు తగ్గేందుకు మీరు దీన్ని సలాడ్ రూపంలో తీసుకోవచ్చు.

పనీర్‌

పనీర్ చాలా రుచికరమైనది అలాగే చాలా ఆరోగ్యకరమైనది. పనీర్‌ను పచ్చిగా కూడా తినవచ్చు.సలాడ్‌లో పనీర్‌ను కూడా చేర్చుకోవచ్చు. ఇందులో ప్రొటీన్, ఫైబర్ ఉంటాయి. ఇవి బరువు అలాగే పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతాయి. ఇందులో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది ప్రశాంతంగా నిద్ర పొందడానికి సహాయపడుతుంది.

సలాడ్

రాత్రి భోజనంలో మీరు గ్రీన్ సలాడ్ తినవచ్చు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. దీనిని తింటే చాలా కాలం పాటు మీ పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. తద్వారా వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..