Weight loss : ఈ సమయాల్లో నీళ్లు తాగితే.. బరువు తగ్గడం ఖాయమట.. ట్రై చేయండి ఇలా..!!

బరువు తగ్గేందుకు యూట్యూబ్‌లో ఉండే వీడియోలను చూస్తూ.. అందులో ఇచ్చే సలహాలను వింటూ ప్రయత్నిస్తుంటారు. అయితే మనం నిత్యం తాగే నీరు కూడా మన శరీర బరువును అదుపులో ఉంచుతుందన్న విషయం చాలా మందికి తెలియదు.

Weight loss : ఈ సమయాల్లో నీళ్లు తాగితే.. బరువు తగ్గడం ఖాయమట.. ట్రై చేయండి ఇలా..!!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: seoteam.veegam

Updated on: Mar 31, 2020 | 1:03 AM

ప్రస్తుత బిజీ లైఫ్‌లో సరైన సమయానికి ఆహారం తినక.. ఉబకాయంతో బాధపడేవారు అనేక మంది ఉన్నారు. బరువు తగ్గేందుకు అనేక మంది ఆస్పత్రులు, జిమ్ సెంటర్లు, వ్యాయమం చేస్తూ.. అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇన్ని చేసినా కొంత మందిలో ఎలాంటి మార్పు ఉండదు. మరికొందరైతే.. బిజీ షెడ్యూల్‌ ఉద్యోగాల కారణంగా వ్యాయామం చేయడానికి కూడా సమయం దొరకకుండా.. గడుపుతుంటారు. కొందరైతే తినే ఆహారంలో మార్పులు చేస్తూ.. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంటారు. యూట్యూబ్‌లో ఉండే వీడియోలను చూస్తూ.. అందులో ఇచ్చే సలహాలను వింటూ ప్రయత్నిస్తుంటారు. అయితే మనం నిత్యం తాగే నీరు కూడా మన శరీర బరువును అదుపులో ఉంచుతుందన్న విషయం చాలా మందికి తెలియదు. అధిక బరువు ఉన్న వారు పక్కాగా నీరు తాగే విధానంలో మార్పులు చేసుకుంటే బరువు తగ్గుతారని పరిశోధనల్లో తేలిందట.

బ్లాక్‌బర్గ్‌కు చెందిన కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ లైఫ్‌​ సైన్సెస్‌ యాట్‌ వర్జీనియా టెక్‌లోని డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ న్యూట్రిషన్‌,ఫుడ్స్‌ అండ్‌ ఎక్సర్‌సైజెస్‌‌కు చెందిన పరిశోధకులు.. బరువు తగ్గే అంశంపై ప్రత్యేకంగా పరిశోధనలు జరిపారట. వీరు చేసిన పరిశోధనల్లో నీరు తాగడం ద్వారా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. సరిగ్గా ఆహారం తీసుకోబోయే ముందు రెండు కప్పుల నీరు తాగితే చాలట. సరిగ్గా 12 వారాల్లో 2 కిలోల బరువు తగ్గే అవకాశం ఉందంటున్నారు ఈ పరిశోధకులు.

వీరు 48 మందిపై ప్రయోగాత్మకంగా పరిశోధనలు జరిపిన తర్వాత ఈ విషయాన్ని తెలిపారు. ఈ 48 మందిలో 55నుంచి 75 సంవత్సరాలు కలిగిన వారిని ఎంచుకున్నారు. వీరిని రెండు ప్రత్యేక గ్రూపులుగా విభజించారు. ఓ గ్రూపును ఆహారం తీసుకునే ముందు ప్రతిసారి.. రెండు కప్పుల నీరు తాగేలా చూశారు. ఇక మరో గ్రూపుకు మాత్రం ఎలాంటి నిబంధనలు లేకుండా.. ఆహారం తీసుకొమ్మన్నారు. ఇలా 12వారాల తర్వాత భోజనాలకు ముందు నీరు తీసుకున్న వారిని పరిశీలిస్తే.. వారంతా అదనంగా దాదాపు 2కిలోల బరువు తగ్గినట్లు గుర్తించారు. అదే సమయంలో మరో గ్రూప్‌లో ఉన్న వారి బరువులో ఎలాంటి మార్పు లేదని గుర్తించారు.