బట్టలు ఉతికే సమయంలో వాషింగ్ మెషీన్‌లో ఐస్ క్యూబ్స్ వేయండి.. మీ పని మరింత సులువవుతుంది..!

|

Jul 21, 2023 | 6:01 PM

ముఖ్యంగా గృహిణులకు లాండ్రీ తలనొప్పి అంతా ఇంతా కాదు. చాలా సార్లు, వారాంతంలో బట్టలు ఉతకడం, ఆరబెట్టడం, సర్దుకోవటం వంటి వాటితోనేవారి పూర్తి సమయం గడిచిపోతుంది. ఇలాంటి కష్టాలకు చెక్‌ పెట్టేలా.. ఈ రోజు మేము మీ పనిని తేలికపరచడానికి గొప్ప ఉపాయాన్ని పరిచయం చేయబోతున్నాం..అందుకు మీకు కావలసిందల్లా డ్రైయర్ తో కూడిన వాషింగ్‌ మెషిన్‌, కొన్ని ఐస్ క్యూబ్‌లు ఉంటే చాలు.

బట్టలు ఉతికే సమయంలో వాషింగ్ మెషీన్‌లో ఐస్ క్యూబ్స్ వేయండి.. మీ పని మరింత సులువవుతుంది..!
Washing Machine Hacks
Follow us on

బట్టలు ఉతకడం దగ్గర్నుంచి వాటిని ఆరబెట్టడం, మడతపెట్టడం, అల్మారాలో నీట్‌గా జర్దడం వరకు చేసే పని చాలా బేజారుగా ఉంటుంది. ఈ పనిని ఆస్వాదించే వారెవరూ ఉండరు. ముఖ్యంగా గృహిణులకు లాండ్రీ తలనొప్పి అంతా ఇంతా కాదు. చాలా సార్లు, వారాంతంలో బట్టలు ఉతకడం, ఆరబెట్టడం, సర్దుకోవటం వంటి వాటితోనేవారి పూర్తి సమయం గడిచిపోతుంది. ఇలాంటి కష్టాలకు చెక్‌ పెట్టేలా.. ఈ రోజు మేము మీ పనిని తేలికపరచడానికి గొప్ప ఉపాయాన్ని పరిచయం చేయబోతున్నాం..అందుకు మీకు కావలసిందల్లా డ్రైయర్ తో కూడిన వాషింగ్‌ మెషిన్‌, కొన్ని ఐస్ క్యూబ్‌లు ఉంటే చాలు. ఇక మీ పని సగానికి తగ్గించుకోవచ్చు. అదేలాగో మీకు తెలియకపోతే, ఒకసారి ప్రయత్నించండి.

మెషిన్‌లో బట్టలు ఉతికిన తర్వాత, డ్రైయర్‌లో ఆరబెట్టే ముందు కొన్ని ఐస్ క్యూబ్‌లను వేయాలి. మీరు ఆరబెట్టేందుకు బట్టలను బయటకు తీసినప్పుడు.. అది కుంచించుకుపోకుండా..ఆరిన తర్వాత మడతపెట్టేందుకు కూడా మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు. బట్టలు ముడతలు పడకుండా ఉండటానికి డ్రైయర్‌లో ఐస్ క్యూబ్స్‌ వేయటం వెనుక పెద్ద సైన్స్ ఏమీ లేదు. దాని తర్కం ఏమిటంటే, డ్రైయర్ ఉష్ణోగ్రతను పెంచడం వల్ల ఐస్‌ క్యూబ్స్‌ కరిగి ఆవిరి ఏర్పడుతుంది. ఇది బట్టలను నిఠారుగా చేస్తుంది. ఈ అద్భుతమైన వాషింగ్ మెషీన్ హ్యాక్‌ని ప్రయత్నించడానికి మీకు ఐస్‌ కూడా ఎక్కువగా అవసరం లేదు . బెస్ట్‌ రిజల్ట్స్‌ కోసం ఒక స్మాల్‌ బౌల్‌ ఐస్‌ క్యూబ్స్‌ ఉంటే సరిపోతుంది. పది నిమిషాల పాటు డ్రైయర్‌ని రన్ చేస్తే సరిపోతుంది.

అయితే, మీ వాషింగ్‌ మిషన్‌లో డ్రైయర్ లేకపోతే కూడా మీరు టెన్షన్‌ పడొద్దు. అలాంటి వారు కూడా ఈజీగా బట్టలు ముడతలు పడకుండా ఆరబెట్టుకునేందుకు చక్కటి ఉపాయం ఉంది. దీని కోసం, మీరు చేయాల్సిందల్లా వెనిగర్ తీసుకుంటే చాలు. వెనిగర్‌, నీటిని 1: 3 నిష్పత్తిలో కలపండి. స్ప్రే బాటిల్‌లో నింపండి. తర్వాత బట్టలను హ్యాంగర్లపై వేలాడదీయండి. మడతలు ఉన్న ప్రదేశాలలో మిశ్రమాన్ని స్ప్రే చేయండి. ఇలా చేశాక, ఆరిన తర్వాత బట్టల ముడతలు కనిపించవు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..