Travel Anxiety: ప్రయాణం అంటే ఎందుకంత టెన్షన్? ఈ టిప్స్ పాటించండి.. మీ జర్నీఇక కూల్‌గా సాగిపోతుంది..
ప్రయాణం అనగానే ఒకరకమైన ఆందోళన మనసులో నుంచి పుట్టుకొస్తుంది. కొత్త ప్రదేశాల్లో తిరగాలన్నా.. ఉన్న చోటు నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లాలన్నా చాలా టెన్షన్ పడిపోతుంటారు. దీనినే ట్రావెల్ యాంగ్జైటీ అంటారు. అటువంటి వారితో కలసి ప్రయాణమంటే పక్కనున్న వారికి కాస్త ఇబ్బందే.
కొత్త ప్రదేశాలకు టూర్ ప్లాన్ చేస్తుంటే చాలా మందిలో తెలియని ఉత్సాహం వస్తుంది. తెలియని ప్రాంతాలను చూడటం, తిరగడం కొత్త అనుభూతిని ఇస్తుంది. అయితే కొంత మందిలో దీనికి వ్యతిరేకమైన అనుభూతి అనుభవిస్తారు. ప్రయాణం అనగానే ఒకరకమైన ఆందోళన మనసులో నుంచి పుట్టుకొస్తుంది. కొత్త ప్రదేశాల్లో తిరగాలన్నా.. ఉన్న చోటు నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లాలన్నా చాలా టెన్షన్ పడిపోతుంటారు. దీనినే ట్రావెల్ యాంగ్జైటీ అంటారు. అటువంటి వారితో కలసి ప్రయాణమంటే పక్కనున్న వారికి కాస్త ఇబ్బందే. అయితే దీనికి కూడా ఓ ప్రత్యామ్నాయ మార్గం ఉంది. ట్రావెల్ యాంగ్జైటీని తగ్గించుకునే టెక్నిక్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ట్రావెల్ యాంగ్జైటీ అంటే..
సాధారణంగా ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తున్నప్పుడు అందరిలోనూ ఏదో తెలియని అనుభూతిని పొందుతారు. అయితే కొంత మంది మాత్రం భయం, ఆందోళనతో ఇబ్బంది పడతారు. దీనినే ట్రావెల్ యాంగ్జైటీ అంటారు. ట్రావెల్ యాంగ్జైటీ ఉన్న వారితో ప్రయాణించడం కాస్త ఇబ్బందికరమే. కొంతమందిలో అయితే కొత్త ప్రదేశానికి ప్లాన్ చేస్తున్నామనగానే వారి మదిలో ఆందోళన, భయం మొదలవుతుంది. అటువంటి వారు ఉన్న ప్రాంతానికే పరిమితం అవుతారు. కనీసం బంధువులు ఉన్న ప్రాంతాలకు వెళ్లలేరు. కొత్త ప్రదేశాలకు ప్రయాణాలు చేయలేరు. అయితే దీనిని ఓ వ్యాధిగా మనం పరిగణించలేం. కానీ ఇది కూడా మీ ఓవరాల్ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది.
ట్రావెల్ యాంగ్జైటీని ఎలా గుర్తించాలి..
ట్రావెల్ యాంగ్జైటీ అనేది చాలా మందికి ఎదురవుతుంటుంది. దీని లక్షణాలను పరిశీలిస్తే.. కొంచెం అసౌకర్యంగా అనిపించడంతో మొదలై, తీవ్రమైన ఆందోళనతో కూడిన ఇబ్బందులు వస్తాయి. వాటిల్లో చిన్న చిన్న విషయాలకే కోపగించుకోవడం, నిద్ర పట్టకపోవడం, నిరంతరమైన ఆందోళన, అధికంగా చెమట పట్టడం, హార్ట రేట్ పెరిగిపోతుండటం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, మగతా అనిపించడం, ప్రయాణానికి సంబంధించిన వాటిపై ఆసక్తి లేకపోవడం వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. ఇది తీవ్ర తరమైతే సమాజంలో కూడా వ్యక్తులతో కలవలేకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఎలా నియంత్రించాలంటే..
- ముందుగా ట్రావెల్ యాంగ్జైటీ కి కారణమవుతున్న అంశాలను గుర్తించాలి. అందుకు చాలా సమయం పడుతుంది. ఓపిక కావాలి. అయితే ఒక్కసారి వాటిని గుర్తించిన తర్వాత వాటి నుంచి బయట పడటం సులభం అవుతుంది. మీరు దేని గురించైతే ఆందోళన చెందుతున్నారో.. దానిని అధిగమించేందుకు అవకాశం ఉన్నంత వరకూ ముందుగానే ప్రిపరేషన్స్ మొదలు పెట్టాలి. మీ ప్రయాణం ఎప్పుడో ముందుగానే డేట్ ఫిక్స్ చేసుకొని, ప్లాన్ చేసుకోవాలి.
- ఒక వేళ మీ ఆందోళన జర్నీ చేయడం అయితే.. అంటే బస్సు, కారు, రైలులో ప్రయాణం మీకు ఇబ్బంది అయితే దాని నుంచి బయట పడటానికి ఆ సమయంలో మిమ్మల్ని మీరు బిజీ చేసుకోండి. అంటే పజిల్స్ చేయడం, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, టీవీ షోలు చూడటం వంటి చేస్తే మీ ప్రయాణ సమయం మీకు తెలియకుండానే గడిచిపోతుంది.
- మీలో ఆందోళన స్థాయి పెరిగిపోతుంది అనుకుంటే.. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి శ్వాస వ్యాయమాలు చేయడం ఉత్తమం. మనస్సును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అవసరం అయితే ట్రిప్ ప్రారంభమయ్యే ముందు కాసేపు ధ్యానం చేయాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..