
చేతులు కడుక్కునే అలవాటు మంచి పరిశుభ్రతను సూచిస్తుంది. ఇది అనేక అంటు వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, వ్యాధులను నివారించడానికి సులభమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గం తరచుగా చేతులు కడుక్కోవడం. ప్రతిరోజూ చేతులు కడుక్కోవడం ద్వారా ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించవచ్చు. దీని ద్వారా వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరం మొదలైన ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ప్రతి 3 విరేచన వ్యాధుల రోగులు, ప్రతి 5 జలుబు లేదా ఫ్లూ రోగులు సూక్ష్మజీవులు,చేతులపై ఉన్న బ్యాక్టీరియా కారణంగా వ్యాపిస్తాయి. అందువల్ల ఆరోగ్యం కోసం సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం.
రోజు మొత్తంలో పలు మార్లు చేతులు కడుక్కోవడం వల్ల అతిసార వ్యాధులు 24 నుంచి 40%, పిల్లలలో జీర్ణశయాంతర వ్యాధులు 29 నుంచి 57%, జలుబు, ఫ్లూ వంటి వైరల్ వ్యాధులు 16 నుంచి 20% తగ్గుతాయని నివేదికలు చెబుతున్నాయి. అందుకే టాయిలెట్ ఉపయోగించిన తర్వాత వంట చేసే ముందు, తినడానికి ముందు, తుమ్మిన తర్వాత, దగ్గిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం.
మంచి ఆరోగ్యానికి చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం. ఇది పరిశుభ్రతలో ఒక భాగం. చేతులు కడుక్కోకపోతే లేదా సరిగ్గా కడుక్కోకపోతే వైరస్లు, బ్యాక్టీరియా చేతుల ద్వారా మన శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తాయి. దీని కారణంగా మనం అనారోగ్యానికి గురవుతాం. అదే సబ్బుతో చేతులు కడుక్కోవడం వల్ల అనేక వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. కేవలం చేతులు కడుక్కుంటే సరిపోదు.. చేతులను సరిగ్గా కడుక్కోవడం కూడా చాలా ముఖ్యం. సబ్బు, నీటితో మీ చేతులను కడిగిన తర్వాత శుభ్రమైన గుడ్డతో చేతులను తుడవాలి. ఇలా చేయడం ద్వారా చేతుల నుంచి వ్యాపించే వ్యాధులను నివారించవచ్చు.
గమనిక: ఇందులో అందించిన విషయాలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. మేము వాటిని నిర్ధారించడం లేదు. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించండి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.