Stay Active Tips: రోజంతా యాక్టీవ్‌గా ఉండాలనుకుంటున్నారా.. వీటిని ట్రై చేయండి!

|

Jan 29, 2024 | 2:59 PM

రోజంతా యాక్టీవ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండాలంటే కష్టమే. మార్నింగ్ బాగా యాక్టీవ్‌గా ఉన్నా.. మధ్యాహ్నం అవ్వగా కాస్త తగ్గుతుంది. ఇక సాయంత్రానికి యాక్టీవ్‌నెస్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. చేయాల్సిన పని ఉన్నా కానీ.. తర్వాత చేసుకుందాంలే అనే రేంజ్‌‌కి వెళ్లి పోతారు. కానీ రోజంతా యాక్టీవ్‌గా ఉంటే చేయాల్సిన పనులు.. త్వరగా పూర్తి అయిపోతాయి. మీరు ఆనందంగా గడపటానికి కాస్త సమయం కూడా దొరికినట్టు ఉంటుంది. సమయం కూడా ఆదా అవుతుంది. ఒత్తిడి తగ్గి.. రిలీఫ్‌గా అనిపిస్తుంది. కానీ రోజంతా యాక్టీవ్‌గా ఎనర్జిటిక్‌గా..

Stay Active Tips: రోజంతా యాక్టీవ్‌గా ఉండాలనుకుంటున్నారా.. వీటిని ట్రై చేయండి!
Activeness
Follow us on

రోజంతా యాక్టీవ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండాలంటే కష్టమే. మార్నింగ్ బాగా యాక్టీవ్‌గా ఉన్నా.. మధ్యాహ్నం అవ్వగా కాస్త తగ్గుతుంది. ఇక సాయంత్రానికి యాక్టీవ్‌నెస్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. చేయాల్సిన పని ఉన్నా కానీ.. తర్వాత చేసుకుందాంలే అనే రేంజ్‌‌కి వెళ్లి పోతారు. కానీ రోజంతా యాక్టీవ్‌గా ఉంటే చేయాల్సిన పనులు.. త్వరగా పూర్తి అయిపోతాయి. మీరు ఆనందంగా గడపటానికి కాస్త సమయం కూడా దొరికినట్టు ఉంటుంది. సమయం కూడా ఆదా అవుతుంది. ఒత్తిడి తగ్గి.. రిలీఫ్‌గా అనిపిస్తుంది. కానీ రోజంతా యాక్టీవ్‌గా ఎనర్జిటిక్‌గా ఉండాలంటే కష్టం. కానీ కొన్ని రకాల టిప్స్ పాటిస్తే.. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా రెస్ట్‌ లెస్‌గా ఫీల్ అవుతారు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

మ్యూజిక్ వినండి లేదా డ్యాన్స్ చేయండి..

రోజంగా యాక్టీవ్‌గా ఉండటం కష్టమే. కానీ మీరు రోజంతా యాక్టీవ్‌గా ఉండేందుకు వ్యాయామం బాగా హెల్ప్ చేస్తుంది. కానీ ఎక్సర్‌సైజ్ చేసే ఓపిక, ఇంట్రెస్ట్ లేకపోతే.. మ్యూజిక్ వినండి. మీకు నచ్చిన పాటలు ఉదయాన్నే వింటే మీ మూడు అంతా చేంజ్ అయిపోతుంది. రీఫ్రెష్‌గా అనిపిస్తుంది. అలాగే ఆ మ్యూజిక్‌కి డ్యాన్సులు కూడా చేస్తే ఇంకా యాక్టీవ్‌నెస్ అనేది మీలో పెరుగుతుంది. దీంతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ హ్యాపీనెస్ మీరు రోజంతా యాక్టీవ్‌గా ఉండేలా చేస్తుంది.

కామెడీ ట్రాక్స్ వినండి..

మ్యూజిక్, డ్యాన్స్ ఇష్టం లేని కామెడీ ట్రాక్స్ చూడండి. ఉదయం నవ్వడం వల్ల ఒత్తిడి, ఆందోళన అంతా మాయం అవుతుంది. మీ డే హ్యాపీగా స్టార్ట్ అవుతుంది. కాసేపు నవ్వడం వల్ల చాలా రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఇది మీరు రోజంతా యాక్టీవ్‌గా ఉండేందుకు హెల్ప్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

సైక్లింగ్ చేయండి..

మీ మూడ్ చేంజ్ చేసేందుకు.. యాక్టీవ్‌గా ఉండేందుకు ఈ టిప్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సైక్లింగ్ చేయడం వల్ల.. మీ శరీరం అంతా యాక్టీవ్ అవుతుంది. మీకే తెలియని హ్యాపీనెస్ వస్తుంది. ఇది మీరు రోజంతా యాక్టీవ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండేందుకు సహాయ పడుతుంది. అంతే కాకుండా మీరు ఫిట్‌గా తయారవుతారు.

మీకు ఇష్టమైన వాళ్లతో టైమ్ స్పెండ్ చేయండి..

ఉదయాన్నే మీకు నచ్చిన పని చేయడం వల్ల మీలో ఉండే డల్ నెస్ అనేది బయటకు పోతుంది. చాలా మంది వాకింగ్, జాగింగ్‌లకు వెళ్తూ ఉంటారు. మీరు ఒక్కరే కాకుండా మీ ఫ్రెండ్స్, కొలిగ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి వెళ్లడం వల్ల చాలా రీఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. ఇలా మీరు రోజంతా యాక్టీవ్‌గా ఉండొచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.