AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wallet in Back Pocket: మీరు ఫ్యాంటు వెనుక పాకెట్‌లో పర్స్ పెడుతున్నారా? బీ కేర్‌ ఫుల్ బ్రో..

నేటి జీవనశైలి కారణంగా మనలో చాలా మంది తరచూ వెన్ను నొప్పితో బాధపడుతుంటాం. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక కొందరు ఆస్పత్రుల చుట్టు తెగ తిరిగేస్తుంటారు. అయితే ఈ సమస్య రావడానికి.. ఫ్యాంటు వెనుక జేబులో పర్స్ పెట్టడానికి సంబంధం ఉందని మీకు తెలుసా? అవును.. తరచూ ఫ్యాంటు పాకెట్ లో పర్స్ పెట్టే వారిలో తీవ్రంగా నడుము నొప్పి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

Wallet in Back Pocket: మీరు ఫ్యాంటు వెనుక పాకెట్‌లో పర్స్ పెడుతున్నారా? బీ కేర్‌ ఫుల్ బ్రో..
Wallet In Back Pocket
Srilakshmi C
|

Updated on: Jan 27, 2025 | 1:26 PM

Share

నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ఆఫీసులో లేదా ఇంట్లో కూర్చునే విధానంలో మార్పులు వల్ల ఇలా జరుగుతుంది. అలాగే రాత్రి నిద్రపోయే విధానం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. దీంతో నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి మందులు తీసుకోవడం తీసుకోవడం వంటివి చేస్తుంటారు.ఇది తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా.. కొంత కాలం తరువాత తిరిగి సమస్య వస్తుంది. కానీ మీకు తెలుసా? తప్పుడు యాంగిల్‌లో కూర్చోవడం మాత్రమే కాదు.. మీ వెన్ను నొప్పికి మనీ పర్స్ కూడా కారణం కావచ్చు. అవును, ముఖ్యంగా పురుషులలో ఈ సమస్య చాలా సాధారణం. ప్యాంటు వెనుక జేబులో పర్స్ ఉంచివారిలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది.

ఇటీవల అమెరికాలో ఒక విశ్వవిద్యాలయంలో పరిశోధకులు ఈ విషయంపై అధ్యయనం నిర్వహించారు. పర్సు ప్యాంటు వెనుక జేబులో ఉంచడం వల్ల చాలా మందికి కాలు నొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు సంభవిస్తున్నట్లు గుర్తించారు. డాక్టర్ల మాటల్లో చెప్పాలంటే.. వెనుక జేబు ఎక్కడ ఉందో, అంటే సరిగ్గా ఎక్కడ పర్స్ పెడతామో.. అక్కడే తుంటి వెనుక భాగపు నరాలు ఉంటాయి. ఇలా పర్సు జేబులో పెట్టుకుని రోజంతా ఉండటం వల్ల తుంటి వెనుక భాగపు నరాలపై, దాని అనుబంధ కండరాలపై ఒత్తిడి పడుతుంది. ఎక్కువ కాలం ఆ ఒత్తిడిలో ఉండటం నరాలను దెబ్బతీస్తుంది. ఇది వెన్ను నొప్పిని కలిగిస్తుంది. అలాగే మెడ నొప్పి, ఎముక సమస్యలకు దారితీస్తుంది.

ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి?

అన్నింటిలో మొదటిది.. వెనుక జేబులో పర్సు పెట్టే అలవాటును మానేయాలి. ఇలా చేస్తే సగం సమస్య తీరుతుంది.వెనుక జేబులో తేలికపాటి వస్తువులు-కాగితం లేదా కాగితం లేదా పెన్ను వంటివి పట్టుకోవచ్చు. బదులుగా, పర్సుని ముందు జేబులో లేదా భుజం బ్యాగులో ఉంచడం మంచిది. ఇలా చేస్తే దొంగల నుంచి మీ వాలెట్ కూడా సురక్షితంగా ఉంటుంది. సమస్య ఉన్నప్పుడు మాత్రమే మెడిసిన తీసుకోవాలి. అవసరమైతే వైద్యుడిని కూడా సంప్రదించాలి. వెచ్చని నీటితో స్నానం చేసినా ప్రయోజనం ఉంటుంది. అవసరమైతే, నీటిలో కొద్దిగా ఉప్పు జోడించి స్నానం చేయవచ్చు. సాధారణ శారీరక వ్యాయామం కూడా చేయాలి. ఇది దెబ్బతిన్న కండరాలను తిరిగి సక్రియం చేస్తుంది. సమస్య కూడా తక్షణమే తొలగిపోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.