Vitamin B12: రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారా.. విటమిన్ బి12 లోపం ఏమో చెక్ చేసుకోండి

|

Apr 05, 2024 | 12:12 PM

రక్తహీనత సమస్య స్త్రీలు, చిన్న పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణాలు సరైన ఆహారం తీసుకోకపోవడం, విటమిన్ B12 లోపం. NFHS నివేదిక ప్రకారం దేశంలో 14 సంవత్సరాల నుండి 49 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల్లో 60 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. రక్తహీనత కారణంగా శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ సమస్య అనేక ఇతర వ్యాధులకు కూడా కారణం కావచ్చు.

Vitamin B12: రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారా.. విటమిన్ బి12 లోపం ఏమో చెక్ చేసుకోండి
Vitamin B12 Deficiency
Follow us on

మారిన కాలం.. మారిన జీవన విధానంతో ప్రజలు తమ శరీరంలో అనేక రకాల విటమిన్ల లోపాన్ని ఎదుర్కొంటున్నారు. వీటిల్లో విటమిన్ బి12 లోపం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. శరీరంలో ఈ విటమిన్ తక్కువ స్థాయిలో ఉంటే అనేక వ్యాధులకు కారణమవుతుంది. ముఖ్యంగా రక్తహీనత వచ్చే ప్రమాదం కూడా చాలా ఎక్కువ. శరీరంలో ఎర్ర రక్త కణాలు సరైన పరిమాణంలో ఉత్పత్తి కానప్పుడు రక్తహీనత ఏర్పడుతుంది. దీని కారణంగా శరీరంలో రక్తం ఉండదు. అంతేకాదు విటమిన్ లోపం వల్ల వచ్చే రక్తహీనత శరీరంలో క్రమంగా అభివృద్ధి చెందుతుంది. సరైన సమయంలో గుర్తించకపోతే శరీరంలో రక్తహీనత ఏర్పడి ప్రమాదకరంగా మారుతుంది.

రక్తహీనత సమస్య స్త్రీలు, చిన్న పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణాలు సరైన ఆహారం తీసుకోకపోవడం, విటమిన్ B12 లోపం. NFHS నివేదిక ప్రకారం దేశంలో 14 సంవత్సరాల నుండి 49 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల్లో 60 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. రక్తహీనత కారణంగా శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ సమస్య అనేక ఇతర వ్యాధులకు కూడా కారణం కావచ్చు.

విటమిన్ B12 ఎందుకు ముఖ్యమైనది?

ఫోర్టిస్ హాస్పిటల్ నోయిడాలోని ఇంటర్నల్ మెడిసిన్ విభాగానికి చెందిన డాక్టర్ అజయ్ అగర్వాల్ మాట్లాడుతూ విటమిన్ బి12 శరీరానికి చాలా ముఖ్యమైనదని చెప్పారు. ఈ విటమిన్ మెదడు పనితీరును మెరుగ్గా నిర్వహించడంలో సహాయపడుతుంది. అనేక రకాల సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. విటమిన్ B12 లోపం రక్తహీనత ప్రమాదాన్ని పెంచుతుంది. దీంతో శరీరంలో రక్తం అందక పోవడం. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది వారికి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.

ఇవి కూడా చదవండి

విటమిన్ B12 లోపం వలన ఏర్పడే లక్షణాలు

నిరంతర అలసట

ఊపిరి ఆడకపోవడం

తల తిరగడం

బరువు తగ్గడం

కండరాల బలహీనత

మానసిక ఇబ్బంది

ఆహార లేమి

గ్యాస్ట్రిక్ ఇబ్బంది

ప్రేగు సమస్యలు

ఉదరకుహర వ్యాధి

అధిక మద్యం వినియోగం

ఏ పదార్థాలలో విటమిన్ డి ఉంటుంది?

మాంసం

పాలు

గుడ్లు

బ్రోకలీ

నవ ధాన్యాల మొలకలు

బ్రౌన్ రైస్

ఏ మందులు తీసుకోవాలంటే

5-10 రోజులు రోజుకు ఒకసారి 30 mcg IM

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)