Vastu Tips : ఉత్తమ నిద్ర కోసం వాస్తు చిట్కాలు..! ఈ తప్పులు చేస్తే మీకు ప్రశాంతమైన నిద్ర ఎప్పటికీ దొరకదు..

Vastu Tips : ఒక వ్యక్తి 8 గంటలు నిద్రపోతే అతని శరీరం, మనస్సు రెండింటి అలసట పోతుంది. తిరిగి శక్తి పునరుద్దరణ జరగుతుంది. కానీ నేటి జీవన విధానం వల్ల

Vastu Tips : ఉత్తమ నిద్ర కోసం వాస్తు చిట్కాలు..! ఈ తప్పులు చేస్తే మీకు ప్రశాంతమైన నిద్ర ఎప్పటికీ దొరకదు..
Sleepiing Disorder

Updated on: Jul 16, 2021 | 8:55 AM

Vastu Tips : ఒక వ్యక్తి 8 గంటలు నిద్రపోతే అతని శరీరం, మనస్సు రెండింటి అలసట పోతుంది. తిరిగి శక్తి పునరుద్దరణ జరగుతుంది. కానీ నేటి జీవన విధానం వల్ల నిద్రకు సరైన సమయం కేటాయించలేకపోతున్నారు. ఇష్టారీతిన నిద్రించడం వల్ల మనస్సుకు ప్రశాంతత దొరకదు. అలసట, చిరాకు, సోమరితనం, రోజంతా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం సరైన నిద్ర రాకపోవడానికి చాలా సార్లు పడుకునే దిశ లేదా కొన్ని ఇతర అలవాట్లు కారణమవుతాయి. ఒక వ్యక్తి వాస్తు శాస్త్రంలో పేర్కొన్న నియమాలను పాటిస్తే ప్రశాంతంగా నిద్రపోవడమే కాదు, శారీరక-మానసిక ఆరోగ్యం, ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతాయి. వాస్తు ప్రకారం నిద్ర నియమాలు ఈ విధంగా ఉంటాయి.

1. వాస్తు ప్రకారం తూర్పుకు తలపెట్టి పడుకోవడం మంచిదంటారు. ఇది మనస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు. సామర్థ్యం, ఏకాగ్రత దొరుకుతుంది. ఇది కాకుండా మీరు పడమర వైపు పడుకోవచ్చు. ఇది కీర్తి, అదృష్టం పెరుగుదలకు దారితీస్తుంది.

2. అలాగే ఉత్తర దిశలో తలపెట్టి పడుకోవడం ప్రతికూల ఆలోచనలను దారీతీస్తుంది. అనేక వ్యాధులు అభివృద్ధి చెందుతాయి. మరోవైపు దక్షిణ దిశలో తలపెట్టి నిద్రించడం ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. నిద్రపోయే ముందు చేతులు, నోరు కడుక్కోవాలి. ఇలా చేస్తే మంచి నిద్ర వస్తుందని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు.

3. మురికి మంచంపై లేదా విరిగిన మంచంపై నిద్రించకూడదు. ఇలా చేస్తే చాలా దరిద్రం. వ్యాధులు వ్యక్తిని చుట్టుముడుతాయి. ఇది కాకుండా ఎప్పుడూ నగ్నంగా నిద్రపోకూడదు.

4. ఎవరూ నివసించని ఎడారి ఇళ్లలో, శ్మశానవాటికలు, గర్భగుడి ఆలయంలో గది పూర్తిగా చీకటిగా ఉండకూడదు. నిద్రిస్తున్నప్పుడు తేలికపాటి కాంతిని ఉంచండి. నిర్జనమైన ఇల్లు, శ్మశానవాటిక లేదా దేవాలయం గర్భగుడిలో పూర్తి నిశ్శబ్దం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో రాత్రి నిద్రపోయేటప్పుడు, వ్యక్తి భయపడవచ్చు. అతని ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అదే సమయంలో చీకటిలో ఎవరు ఏమి చూడలేరు.

5. నిద్ర లేకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయి
తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఒక వ్యక్తి ఒత్తిడి, మానసిక వ్యాధుల బారిన పడతాడు. అతని శరీరం, మనస్సు పూర్తి విశ్రాంతి పొందదు. ఈ కారణంగా శరీరంలో నొప్పి, అలసట వంటి సమస్యలు ఏర్పడతాయి. జీర్ణవ్యవస్థ చెదిరిపోతుంది. అన్ని వ్యాధులు చుట్టుముడతాయి. అందుకే ప్రతి ఒక్కరికి 8 గంటల నిద్ర కచ్చితంగా అవసరం.

చాణక్య నీతి : లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆచార్య చాణక్య ఈ 3 మార్గాలను బోధిస్తున్నాడు..

Krishna waters: తెలుగు రాష్ట్రాల లొల్లికి ఫుల్ స్టాప్..! కృష్ణా నీటి వాటా ఎంత..? వినియోగించాల్సిందెంత..? గెజిట్‌‌‌లో తేల్చేసిన కేంద్రం

Tradition: కృష్ణుడు ఆదేశిస్తే ఇంద్రుడు వింటాడు..వర్షాల కోసం శతాబ్దాల క్రితం నుంచి నిర్వహించే ప్రత్యేక వేడుక! ఎక్కడంటే..