Skincare Tips: శనగ పిండితో మెరిసే చర్మం.. మొటిమలు, మచ్చలకు చెక్.. మరి ఎలా ఉపయోగించాలో తెలుసా..?

Besan Scrub for Skin: శనగ పిండి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, ఇంకా చర్మంపై నిర్జీవ కణాలను తొలగించడంలో సహాయ పడుతుంది. అలాగే చర్మ రంధ్రాల లోతుల్లో పేరుకు పోయిన మురికిని శుభ్రం చేయగలదు. శనగ పిండిని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా, మెరిసేలా చేయడంతో పాటు సమస్యలు దూరం అవుతాయి. ఈ క్రమంలో శనగ పిండిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు..

Skincare Tips: శనగ పిండితో మెరిసే చర్మం.. మొటిమలు, మచ్చలకు చెక్.. మరి ఎలా ఉపయోగించాలో తెలుసా..?
Besan Scrubs For Skin

Updated on: Sep 18, 2023 | 11:33 AM

Besan Scrub for Skin: చర్మ సంరక్షణలో శనగ పిండికి ప్రముఖ స్థానం ఉంది. చర్మం కోసం ఇప్పుడంటే మార్కెట్‌లో రకరకాల కాస్మటిక్స్ అందుబాటులోకి వచ్చాయి. కానీ ప్రాచీన కాలం నుంచి మన పూర్వీకులు శనగ పిండినే ఉపయోగిసూ వచ్చారు. ఈ కారణంగానే కొందరు నేటికీ షాంపూకి బదులుగా శనగ పిండి లేదా సున్ని పిండితో తల స్నానం చేస్తారు. చర్మ సంరక్షణకు శనగ పిండి ఎంతో సహాయ పడుతుంది. శనగ పిండి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, ఇంకా చర్మంపై నిర్జీవ కణాలను తొలగించడంలో సహాయ పడుతుంది. అలాగే చర్మ రంధ్రాల లోతుల్లో పేరుకు పోయిన మురికిని శుభ్రం చేయగలదు. శనగ పిండిని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా, మెరిసేలా చేయడంతో పాటు సమస్యలు దూరం అవుతాయి. ఈ క్రమంలో శనగ పిండిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

శనగ పిండి & రోజ్ వాటర్ స్క్రబ్: చర్మ  సమస్యల నివారణ కోసం ఒక గిన్నెలో 2 స్పూన్ల శనగ పిండి తీసుకుని, దానికి కొద్దిగా రోజ్ వాటర్ కలపండి. అది స్క్రబ్‌ పేస్ట్‌లా మారాక ముఖం, మెడపై సర్క్యులర్ మోషన్‌లో మసాజ్ చేయండి. ఇలా చర్మంపై 15 నిమిషాల పాటు అప్లై చేసి, తర్వాత శుభ్రం చేయండి. మీరు వారానికి రెండు సార్లు శనగ పిండి & రోజ్ వాటర్ స్క్రబ్ ఉపయోగించవచ్చు.

శనగ పిండి & పచ్చి మిల్క్ ఫేస్ స్క్రబ్: మెరిసే చర్మం కోసం ఒక గిన్నెలో 2 చెంచాల శనగ పిండిని, కొద్దిగా పచ్చి పాలు కలపి పేస్ట్‌లా చేయండి. ఆ స్క్రబ్‌ని చర్మానికి బాగా మసాజ్ చేసి, అలా కనీసం పది నిమిషాలు వదిలి వేయండి. తర్వాత దాన్ని కడిగేయండి. ఈ స్క్రబ్ మీ చర్మాన్ని మృదువుగా, మెరుస్తూ.. ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

 శనగ పిండి & నిమ్మ రసం స్క్రబ్: చర్మానికి చాలా అవసరమైన స్క్రబ్ ఇది. ఇందు కోసం ఓ గిన్నెలో రెండు చెండాల శనగ పిండిని, కొద్దిగా నిమ్మ రసం కలపండి. దానికి కొంత నీరు కలిపి స్క్రబ్‌గా చేసుకోండి. ఈ స్క్రబ్‌తో చర్మాన్ని కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేయండి. తర్వాత ముఖం శుభ్రం చేసుకోండి.

శనగ పిండి & కీరదోస రసం స్క్రబ్: శనగ పిండితో పాటు కీర దోస కూడా చర్మాన్ని సంరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులోని పోషకాలే అందుకు కారణం. ఇక శనగ పిండి, కీర దోస రసంతో స్క్రబ్ తయారు చేసుకునేందుకు కీర దోసం రసంలో కొద్దిగా శనగ పిండి కలిపి పేస్ట్‌లా చేసుకోండి. దాన్ని ముఖం, మెడపై మసాజ్ చేసుకోండి. ఇలా కొద్ది సేపు చేయడం వల్ల చర్మం ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. మృదువు, ఆరోగ్యవంతమైన చర్మాన్ని పొందడానికి, వారానికి రెండు సార్లు ఈ హోమ్‌మేడ్ ఫేస్ స్క్రబ్‌ని ఉపయోగించండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..