- Telugu News Photo Gallery Cricket photos Asia Cup 2023: Shubman Gill breaks Virat Kohli's record to hit most international centuries in 2023 so far, during IND vs BAN Super 4 clash
Asia Cup 2023: కింగ్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన ప్రిన్స్.. ‘అత్యధిక సెంచరీలు’ సాధించిన ఆటగాడిగా ఆ లిస్టు టాప్‌లోకి..!
IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఆసియా కప్ సూపర్ 4 క్లాష్‌లో టీమిండియా ఓపెనర్ శుభమాన్ గిల్ అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు. 133 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 121 పరుగులు చేయడంతో పాటు 2023 క్యాలెండర్ ఇయర్‌లో 1000 వన్డే పరుగులను పూర్తి చేసుకున్నాడు. అయితే శుభమాన్ ఈ మ్యాచ్‌లో సాధించిన సెంచరీ ద్వారా రన్ మెషీన్ కోహ్లీ పేరిట ఉన్న సెంచరీల రికార్డును అధిగమించాడు.
Updated on: Sep 16, 2023 | 2:03 PM

భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ జరగక ముందు 2023 కాలెండర్ ఇయర్‌లో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఆటగాడిగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు.

అయితే టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ బంగ్లాదేశ్‌పై సెంచరీ చేయడంతో కోహ్లీని అధిగమించాడు. తద్వారా 2023లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా శుభమాన్ అవతరించాడు.

2023 కాలెండర్ ఇయర్ ఇంకా మిగిలే ఉన్నా.. ఈ ఏడాదిలో కోహ్లీ ఇప్పటివరకు 5 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. మరోవైపు శుభమాన్ బంగ్లాదేశ్‌పై చేసిన సెంచరీతో ఈ ఏడాది 6వ సెంచరీని నమోదు చేసుకున్నాడు.

ఇలా 2023 కాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. సౌతాఫ్రికా ప్లేయర్ టెంబా బావుమా మూడో స్థానంలో ఉన్నాడు

టెంబా బావుమా 2023 కాలెండర్ ఇయర్‌లో 4 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. అతనితో పాటు డెవాన్ కాన్వే(న్యూజిలాండ్), డెరిల్ మిచెల్(న్యూజిలాండ్), నజ్ముల్ హుసేన్ షాంటో(బంగ్లాదేశ్) కూడా ఈ ఏడాదిలో 4 సెంచరీలు చేశారు.




