Vitamin E: పట్టులాంటి మెరిసే చర్మం కోసం ‘విటమిన్ ఇ’ క్యాప్సూల్స్‌తో పాటు.. ఈ 3 పదార్థాలను ఉపయోగించండి..

|

Feb 10, 2024 | 11:51 AM

ఇది మనకు మెరిసే ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. చర్మ నిపుణుల అభిప్రాయం ప్రకారం, విటమిన్ ఇ క్యాప్సూల్స్‌తో పాటు కొన్ని పదార్థాలను ముఖానికి అప్లై చేయడం వల్ల అందమైన, మృదువుగా, మెరిసే చర్మాన్ని పొందవచ్చు. అయితే, ఏ సమస్యకు విటమిన్ ఇ క్యాప్సూల్స్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం ముఖ్యం.

Vitamin E: పట్టులాంటి మెరిసే చర్మం కోసం విటమిన్ ఇ క్యాప్సూల్స్‌తో పాటు.. ఈ 3 పదార్థాలను ఉపయోగించండి..
Skin Glowing Tips
Follow us on

అందమైన మెరిసే చర్మాన్ని పొందాలనేది ప్రతి ఒక్కరి కోరిక. మీరు కూడా పట్టులాంటి మృదువైన చర్మం కావాలనుకుంటే.. మీరు ఖరీదైన ఫేస్‌ క్రీములు, పౌడర్లు ఉపయోగించాల్సిన అవసరం లేదు. విటమిన్ ఇ క్యాప్సూల్స్ సరైన పద్ధతిలో వాడితే చాలు. విటమిన్ ఇ క్యాప్సూల్ చర్మాన్ని మెరిసేలా చేయడంలో, దెబ్బతిన్న చర్మాన్ని సరిచేయడంలో ఉపయోగపడుతుంది. విటమిన్ ఇ క్యాప్సూల్స్ వాడకంతో, కొత్త కణాలు ఏర్పడతాయి. ఇది మనకు మెరిసే ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. చర్మ నిపుణుల అభిప్రాయం ప్రకారం, విటమిన్ ఇ క్యాప్సూల్స్‌తో పాటు కొన్ని పదార్థాలను ముఖానికి అప్లై చేయడం వల్ల అందమైన, మృదువుగా, మెరిసే చర్మాన్ని పొందవచ్చు. అయితే, ఏ సమస్యకు విటమిన్ ఇ క్యాప్సూల్స్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం ముఖ్యం.

ఏ సమస్య కోసం విటమిన్ ఇ క్యాప్సూల్‌ను ఎలా ఉపయోగించాలి:-

చర్మం తెల్లబడటం కోసం:

ఇవి కూడా చదవండి

మీ చర్మం తెల్లగా మారడానికి, 2-3 విటమిన్ ఇ క్యాప్సూల్స్, 2 స్పూన్ల పెరుగు, 1 చెంచా నిమ్మరసం, రోజ్ వాటర్ తీసుకుని బాగా మిక్స్‌ చేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్ సహాయంతో ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాలపాటు అలాగే వదిలేయాలి.. బాగా ఆరిపోయిన తర్వాత.. చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి.

నల్లటి వలయాల నివారణ:

నల్లటి వలయాలను వదిలించుకోవడానికి రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను తీసుకుని దాని నూనెను కళ్ల చుట్టూ రాసుకోవాలి. ఆ తర్వాత తేలికగా మసాజ్ చేయండి. రాత్రంతా అలాగే ఉంచి, ఉదయం చల్లటి నీటితో మీ ముఖాన్ని కడిగేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కొద్ది రోజుల్లోనే నల్లటి వలయాలు తొలగిపోతాయి.

గ్లోయింగ్ స్కిన్ కోసం:

గ్లోయింగ్ స్కిన్ కావాలంటే, 3-4 విటమిన్ ఇ క్యాప్సూల్స్ తీసుకుని, 1 కప్పు బొప్పాయి తొక్క పేస్ట్, 1 టీస్పూన్ తేనె కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ వరకు బాగా పట్టించి 10-15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపు కావచ్చు. క్యాన్సర్ కారణంగా బరువు చాలా వేగంగా తగ్గుతుంది. శరీరంలో ఈ లక్షణాలు కనిపించిన వెంణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి