Gangavalli: ఈ ఆకుకూర వారంలో ఒక్కసారి తిన్నా.. ఊహించని లాభాలు..

|

Oct 11, 2024 | 2:00 PM

ఆకు కూరలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే నాన్ వెజ్ కంటే ఆకు కూరలు తినడం చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో లభిస్తాయి. నాన్ వెజ్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కానీ ఆకు కూరలు తింటే ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవచ్చు. ఈ ఆకు కూరల్లో గంగవల్లి కూడా ఒకటి. దీన్ని పలు ప్రాంతాల్లో పలు రకాలుగా పిలుస్తారు. ఈ ఆకు కూర కాస్త..

Gangavalli: ఈ ఆకుకూర వారంలో ఒక్కసారి తిన్నా.. ఊహించని లాభాలు..
Gangavalli
Follow us on

ఆకు కూరలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే నాన్ వెజ్ కంటే ఆకు కూరలు తినడం చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో లభిస్తాయి. నాన్ వెజ్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కానీ ఆకు కూరలు తింటే ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవచ్చు. ఈ ఆకు కూరల్లో గంగవల్లి కూడా ఒకటి. దీన్ని పలు ప్రాంతాల్లో పలు రకాలుగా పిలుస్తారు. ఈ ఆకు కూర కాస్త పుల్లగా ఉంటుంది. ఎక్కువగా పల్లెటూర్లలో, పొలాల గట్ల లభిస్తుంది. ఇది నేల మీదనే పాకుతుంది. ఈ ఆకు కూరకు పసుపు పచ్చ పూలు కూడా పూస్తాయి. ఇది చాలా సులభంగా లభిస్తుంది. ఈ ఆకులో ఎన్నో పోషకాలు లభిస్తాయి. మరి గంగవల్లి తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గంగవల్లిలో పోషకాలు:

ఈ ఆకుకూరలో విటమిన్లు ఎ, బి, సిలు, కాల్షియం, పొటాషియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా లభిస్తాయి.

వెయిట్ లాస్:

బరువు తగ్గాలి అనుకునేవారు ఈ ఆకు కూర తినడం చాలా మంచిది. ఎందుకంటే ఇందులో పోషకాలు ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలి అనుకునేవారు గంగవల్లి తీసుకుంటే మంచిది.

ఇవి కూడా చదవండి

గుండెకు మేలు:

గంగవల్లి కూర తింటే గుండె కూడా ఆరోగ్యంగా పని చేస్తుంది. ఈ ఆకు కూర తింటే రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. రక్తంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కూడా కరిగించి.. గుండెకు మేలు చేస్తుంది. ఇతర గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తకుండా చేస్తుంది.

జీర్ణ సమస్యలు మాయం:

గంగవల్లి కూర తింటే జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. అజీర్తి, గ్యాస్, మలబద్ధకం సమస్యలు రాకుండా ఉంటాయి. ఇందులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా లభిస్తాయి.

రక్త హీనత తగ్గుతుంది:

రక్త హీనత సమస్యతో బాధ పడేవారు గంగవల్లి కూర తింటే చాలా మంచిది. ఇందులో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రక్త హీనత సమస్య నుంచి బయట పడొచ్చు. అదే విధంగా చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు, మొటిమలు తగ్గి యవ్వనంగా ఉంటారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..