భారతీయుల వంట గదుల్లో పసుపు తప్పనిసరిగా ఉంటుంది. ఇది లేకుండా వంట పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. ఆరోగ్యంలోనే కాదు అందంలో పసుపుకు డిమాండ్ ఎక్కువే. మొటిమల నుండి టాన్ వరకు, పసుపు వేలాది చర్మ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. అయితే మీరు ఎప్పుడైనా జుట్టు సంరక్షణలో పసుపు వినియోగించారా? జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పెరుగుదలలో పసుపు ప్రత్యేక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పసుపులో అనేక జుట్టు సంబంధిత సమస్యలకు పరిష్కరిస్తుంది.
పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది జుట్టు రాలడం, తల దురద, చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి హెయిర్ ఫోలికల్స్ ను రక్షిస్తాయి. పసుపు తలపై యాంటీ ఫంగల్ పదార్ధంగా పనిచేస్తుంది. ఇది ఫంగస్‌తో పోరాడి, చుండ్రును నివారిస్తుంది. పసుపు జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించడం ద్వారా బలమైన జుట్టును అందిస్తుంది. అయితే జుట్టు సంరక్షణలో పసుపును ఎలా వినియోగించాలంటే..
రోజువారీ షాంపూలో 1 టీస్పూన్ పసుపు పొడిని కలుపుకోవాలి. దీనిని స్కాల్ప్ శుభ్రం చేయడానికి ఉపయోగించాలి. ఇది చుండ్రు నివారణతోపాటు జుట్టు వేగంగా పెరిగేలా చేస్తుంది. అలాగే 1/4 కప్పు కొబ్బరి నూనెలో 1 టీస్పూన్ పసుపు పొడిని కలపాలి. షాంపూ చేయడానికి 30 నిమిషాల ముందు ఈ నూనెను తలకు, జుట్టుకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. ఇది జుట్టును మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది.
1/2 కప్పు పుల్లని పెరుగులో 2 స్పూన్ల ఆలివ్ ఆయిల్, 2 స్పూన్ల పసుపు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు, తలకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ హెయిర్ మాస్క్ జుట్టు రాలడం, చుండ్రు సమస్యను తగ్గిస్తుంది.
1 కప్పు నీటిలో 1 టీస్పూన్ పసుపు కలిపి.. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ పసుపు నీళ్లను జుట్టుకు అప్లై చేయాలి. 20 నిమిషాలు అలాగే ఉంచి వేచి తర్వాత జుట్టును సాధారణ నీటితో మళ్లీ శుభ్రం చేసుకోవాలి. ఇది చుండ్రు సమస్యను నయం చేయడంలో సహాయపడుతుంది
మరిన్ని లైఫ్‌స్టైల్ సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.