కనుబొమ్మలు అందంగా, ఒత్తుగా, దృఢంగా పెరిగేందుకు అద్భుత ఆయిల్‌.. హోం రెమిడీస్ లో ఈ ఒక్కటి చాలు!

మీరు కూడా సన్నని, తేలికైన కనుబొమ్మల సమస్యను ఎదుర్కొంటున్నారా..? అయితే, చింతించకండి. ఇక్కడ సూచించే కొన్ని నూనెలు మీ కన్నుబొమ్మలను మందంగా, దట్టంగా ఉండేలా చేస్తాయి. దీంతో మీరు మేకప్ వాడకుండానే ఇంట్లోనే కనుబొమ్మలను పెంచుకోవచ్చు. అలాంటి నూనెలు ఏవో ఇక్కడ చూద్దాం..

కనుబొమ్మలు అందంగా, ఒత్తుగా, దృఢంగా పెరిగేందుకు అద్భుత ఆయిల్‌.. హోం రెమిడీస్ లో ఈ ఒక్కటి చాలు!
Eyebrows Beautiful

Updated on: Sep 14, 2025 | 12:16 PM

చాలా మంది అమ్మాయిల కనుబొమ్మలు సన్నగా, పల్చగా ఉంటాయి. అలాగే, కొంత మంది స్త్రీల కనుబొమ్మల పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. దీని కారణంగా వారు కనుబొమ్మలకు పెన్సిల్ ఉపయోగించడం ప్రారంభిస్తారు. మీరు కూడా సన్నని, తేలికైన కనుబొమ్మల సమస్యను ఎదుర్కొంటున్నారా..? అయితే, చింతించకండి. ఇక్కడ సూచించే కొన్ని నూనెలు మీ కన్నుబొమ్మలను మందంగా, దట్టంగా ఉండేలా చేస్తాయి. దీంతో మీరు మేకప్ వాడకుండానే ఇంట్లోనే కనుబొమ్మలను పెంచుకోవచ్చు. అలాంటి నూనెలు ఏవో ఇక్కడ చూద్దాం..

* ఆలివ్‌ ఆయిల్‌.. ఆలివ్ ఆయిల్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కనుబొమ్మల వెంట్రుకలు పెరగడానికి సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందు ఈ నూనెను మీ కను బొమ్మలకు అప్లై చేయండి.

* కొబ్బరి నూనె.. కనుబొమ్మల వెంట్రుకలకు పోషణనిస్తుంది. ఇది వాటి పెరుగుదలకు సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో ఉండే విటమిన్ సి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

* ఆముదం.. నల్లగా, మందంగా ఉండే కనుబొమ్మలను పొందడానికి, మీరు ఈ నూనెను ఉపయోగించాలి. ఇందులో ఉండే ప్రోటీన్లు, కొవ్వు ఆమ్లాలు, యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్లు మీ కనుబొమ్మల వెంట్రుకలకు మంచి బలాన్ని ఇస్తాయి.

* జోజోబా ఆయిల్– మీ కనుబొమ్మల అందాన్ని మెరుగుపరచడానికి, మేకప్ కు బదులుగా జోజోబా నూనెను ఉపయోగించండి. ఇందులో ఉండే ప్రోటీన్ మీ కనుబొమ్మలను చాలా ఆకర్షణీయంగా చేస్తుంది.

* బాదం నూనె.. కనుబొమ్మల పెరుగుదలను మెరుగుపరచడానికి, మీరు బాదం నూనెను ఉపయోగించవచ్చు. బాదం ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం. ఇది జుట్టును మందంగా, దట్టంగా మార్చడంలో సహాయపడుతుంది.

* ఆమ్లా ఆయిల్.. ఆమ్లా నూనె కనుబొమ్మలను పెంచడంలో కూడా సహాయపడుతుందని మీకు తెలుసా. ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

మీ కనుబొమ్మలను మందంగా, నల్లగా మార్చుకోవడానికి, ఇంట్లో ఈ నూనెలను ఉపయోగించండి.

( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.