AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మెడిటేషన్’ చేస్తున్నారా? అయితే కష్టమే!

మానసిక ప్రశాంతత, మేథోపరమైన చైతన్యం సాధించాలంటే ధ్యానం చేయడమొక్కటే దగ్గరి దారి. మెడిటేషన్ అనేది ఒక పరమౌషధం అని వైద్యశాస్త్రాలే తేల్చిచెప్పేశాయి. మునిపుంగవులు వందేళ్ల వయసు దాటినా దిట్టంగా, ఆరోగ్యంగా వున్నారంటే.. దానికి కారణం వాళ్ళ నిరంతర ధ్యానమేనన్నది ఒక విశ్వాసం. అందుకే.. రోజుకు కనీసం అరఘడియ అయినా ధ్యానముద్రలో ఉంటూ కోట్లాదిమంది మానసిక స్వాంతన పొందడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ.. ఇక్కడే మెడిటేషన్ గురించి ఒక నెగిటివ్ న్యూస్ గ్లోబల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ధ్యానం అలవాటుండే […]

'మెడిటేషన్' చేస్తున్నారా? అయితే కష్టమే!
Pardhasaradhi Peri
|

Updated on: May 13, 2019 | 2:32 PM

Share

మానసిక ప్రశాంతత, మేథోపరమైన చైతన్యం సాధించాలంటే ధ్యానం చేయడమొక్కటే దగ్గరి దారి. మెడిటేషన్ అనేది ఒక పరమౌషధం అని వైద్యశాస్త్రాలే తేల్చిచెప్పేశాయి. మునిపుంగవులు వందేళ్ల వయసు దాటినా దిట్టంగా, ఆరోగ్యంగా వున్నారంటే.. దానికి కారణం వాళ్ళ నిరంతర ధ్యానమేనన్నది ఒక విశ్వాసం. అందుకే.. రోజుకు కనీసం అరఘడియ అయినా ధ్యానముద్రలో ఉంటూ కోట్లాదిమంది మానసిక స్వాంతన పొందడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ.. ఇక్కడే మెడిటేషన్ గురించి ఒక నెగిటివ్ న్యూస్ గ్లోబల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ధ్యానం అలవాటుండే ప్రతి నలుగురిలో కనీసం ఒక్కరు ప్రతికూల ఫలితాలు పొందుతున్నారట. ఆశించిన మానసిక ప్రశాంతత దొరక్కపోగా అనవసర భయం, ఆందోళన కలుగుతోందని యూనివర్సిటీ కాలేజ్ లండన్ రీసెర్చర్లు పసిగట్టారు. మానసిక ఒత్తిడి నుంచి బైటపడ్డం కోసం చేసే ఒక ప్రత్యేక తరహా మెడిటేషన్ తో.. మరింత ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ దాపురిస్తోందని, ఈ రకమైన ఎక్స్‌పీరియన్స్ మహిళల కంటే మగాళ్ళలోనే ఎక్కువగా కనిపిస్తోందని తాజా అధ్యయనం చెబుతోంది. ఆధ్యాత్మిక ధ్యానం మీద ఆధారపడే భక్తజనాన్ని మాత్రం ఇటువంటి దుష్‌ప్రభావాలు తాకడం లేదట.

టాప్ సెలబ్రిటీలు.. వృత్తిపరమైన ఒత్తిళ్లనుంచి తప్పించుకోవడం కోసం మెడిటేషన్‌ని ఆశ్రయించడం సహజం. కానీ.. వీళ్ళ నుంచే ఎక్కువ సంఖ్యలో నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినట్లు UCL రీసెర్చర్ మార్కో శ్లాషర్ చెబుతున్నారు. హాలీవుడ్ స్టార్స్ ఎమ్మా వాట్సన్, ఏంజెలినా జోలీ లాంటి అనేకమంది మెగా సెలబ్రిటీలకు మెడిటేషన్ మీద ప్రగాఢమైన విశ్వాసం. కానీ.. ఇప్పుడు అదే మెడిటేషన్‌తో అసౌకర్యానికి గురవుతున్నామంటూ వాళ్ళే రిపోర్ట్ చేస్తున్నారు. హెల్త్ ప్రమోటింగ్ టెక్నిక్‌గా చెలామణీ అవుతూ తరాలతరాల పాటు జనబాహుళ్యంలోకి చొచ్చుకెళ్లిన మెడిటేషన్ ప్రక్రియను తాజా రీసెర్చ్ బాగా దెబ్బతీస్తోంది. నలుగురిలో ఒకరు.. అంటే కనీసం 25 శాతం మందికి ధ్యానముద్ర ఒక దండగమారి ముద్ర. తస్మాత్ జాగ్రత్త!