Travel India: వేసవిలో భూతల స్వర్గం ఈ ప్రదేశాలు.. భారతదేశపు మినీ స్విట్జర్లాండ్ హిల్ స్టేషన్లు ఇవే..
ఎవరైనా విదేశాలకు వెళ్ళాలంటే ముందుగా స్విట్జర్లాండ్‌కు వెళ్లడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాతావరణం, ప్రకృతి ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయి. అయితే భారతదేశంలో కూడా స్విట్జర్లాండ్ లాంటి అందమైన ప్రదేశాలు ఉన్నాయని మీకు తెలుసా.. అవి మీకు యూరప్‌లో ఉన్నట్లుగా అనిపిస్తాయి. ఈ రోజు భారతదేశపు మినీ స్విట్జర్లాండ్ అని పిలువబడే ఆ హిల్ స్టేషన్ల గురించి తెలుసుకుందాం.

ఒక వైపు భారతదేశంలో వెసవిలోని మండే ఎండలతో విపరీతమైన ఉక్కపోత, చెమటలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు హిమాలయాల ఒడిలో కొన్ని ప్రదేశాలు వేసవి నుంచి ఉపశమనాన్ని అందించడమే కాదు చూసేందుకు స్వర్గంలా అందంగా ఉంటాయి. వేసవి ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ.. ప్రజలు చల్లని ప్రదేశాల్లో పర్యటించేందుకు తరలిపోతారు. పర్వతాలు, ప్రకృతి మధ్య ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. ఎత్తైన పర్వతాలు , మంచు లోయలను చూసే విషయానికి వస్తే స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉంటుంది. ఈ ప్రదేశం దాని అందానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అందుకనే భారతీయులు మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్లాలని కోరుకుంటారు.
అయితే మన భారతదేశంలో కూడా కొన్ని హిల్ స్టేషన్లు స్విట్జర్లాండ్ తలపించే విధంగా ఉంటాయని మీకు తెలుసా.. వీటిని మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. కనుక ఈ రోజు భారతదేశ మినీ స్విట్జర్లాండ్ ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఈ వేసవిలో మీరు అక్కడికి వెళ్లి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. ప్రకృతి, పర్వతాల మధ్య ప్రశాంతమైన క్షణాలను గడపవచ్చు. మీరు సాహసయాత్రను కూడా అనుభవించవచ్చు.
హిమాచల్ ప్రదేశ్ లోని ఖజ్జియార్ ఖజ్జియార్‌ను మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇక్కడ చుట్టూ పచ్చదనం నిండి ఉంటుంది. మధ్యలో ఒక చిన్న అందమైన సరస్సు .. పైన్ చెట్లు చాలా దూరం విస్తరించి ఉన్నాయి. ఖజ్జియార్ హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో డల్హౌసీ నుంచి 22 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ గుర్రపు స్వారీ, పిక్నిక్, ఫోటోగ్రఫీని ఆస్వాదించవచ్చు అలాగే సరస్సు దగ్గర సమయం గడపవచ్చు.
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి
View this post on Instagram
మంచు దుప్పటి కప్పుకున్న గుల్మార్గ్ గుల్మార్గ్ అంటే ‘పువ్వుల లోయ’ అని అర్థం. వేసవిలో ఇది పచ్చని పొలాలు, చల్లని గాలితో ఉంటుంది. శీతాకాలంలో ఇది మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ ప్రదేశం చాలా అందంగా ఉండడంతో దీనిని మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈ ప్రదేశం శ్రీనగర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు ఇక్కడ గొండోలా రైడ్ (కేబుల్ కార్), ట్రెక్కింగ్, స్నో స్పోర్ట్స్ వంటి అనేక కార్యకలాపాలు చేయవచ్చు.
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి
View this post on Instagram
ఉత్తరాఖండ్‌లోని ఔలి ఔలి స్కీయింగ్ కు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచి నందా దేవి, ఇతర మంచు శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి. వేసవి నుంచి ఉపశమనం పొందడానికి ఈ ప్రదేశం సరైనది. ఇది కూడా స్విట్జర్లాండ్ కంటే తక్కువ కాదు. ఇక్కడ స్కీయింగ్, ట్రెక్కింగ్, కేబుల్ కార్ రైడింగ్ ఆనందించవచ్చు. అలా ప్రకృతికి దగ్గరగా ప్రశాంతమైన క్షణాలను గడపవచ్చు.
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి
View this post on Instagram
చాలా అందమైన చోప్తా ఉత్తరాఖండ్ ఒడిలో ఉన్న చోప్తా ప్రశాంతమైన, అందమైన హిల్ స్టేషన్. ఈ ప్రదేశం ఇప్పటికీ భారీ జనం లేకుండా ప్రశాంతంగా ఉంటారు. దీని పచ్చని గడ్డి వాలులు, మంచుతో కప్పబడిన పర్వతాలు, చల్లని గాలి మిమ్మల్ని యూరప్‌లో ఉన్నట్లు అనుభూతిని కలిగిస్తాయి. కనుక ఈ ప్రదేశాన్ని “మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా” అని పిలుస్తారు. ఈ ప్రదేశం ముఖ్యంగా ట్రెక్కింగ్ ప్రియులకు, ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గం లాంటిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








