Travel: ఫారిన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.? ఈ దేశాల్లో మన కరెన్సీతో పండగ చేసుకోవచ్చు..
విదేశీ ప్రయాణాలు అనేసరికి భారీ ఖర్చుతో కూడుకున్న అంశం కావడంతో, ఆసక్తి ఉన్నా ముందడుగు వేయరు. అయితే అమెరికా, యూరప్‌లలో మన కరెన్సీ విలువ తక్కువ కాబట్టి సహజంగా ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే మన కరెన్సీ అధికంగా ఉన్న దేశాలు కూడా ప్రపంచంలో కొన్ని ఉన్నాయని మీకు తెలుసా.? ఇలాంటి దేశాలకు పర్యటన కోసం వెళితే..

ఫారిన్ టూర్స్ వెళ్లాలనేది చాలా మంది చిరకాల స్వప్నంగా ఉంటుంది. అయితే విదేశీ ప్రయాణాలు అనేసరికి భారీ ఖర్చుతో కూడుకున్న అంశం కావడంతో, ఆసక్తి ఉన్నా ముందడుగు వేయరు. అయితే అమెరికా, యూరప్‌లలో మన కరెన్సీ విలువ తక్కువ కాబట్టి సహజంగా ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే మన కరెన్సీ అధికంగా ఉన్న దేశాలు కూడా ప్రపంచంలో కొన్ని ఉన్నాయని మీకు తెలుసా.? ఇలాంటి దేశాలకు పర్యటన కోసం వెళితే.. తక్కువ ఖర్చులోనే విదేశీ యాత్రలను పూర్తి చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ కరెన్సీ విలువ అధికంగా ఉన్న అలాంటి కొన్ని దేశాలపై ఓ లుక్కేయండి..
ఇండోనేషియా..
ఇండోనేషియాలో మన రూపాయి విలువ 186.46 ఇండోనేషియన్ రూపాయ్‌లతో సమానం. అందమైన ద్వీపాలు, ఉష్ణమండల వాతావారణానికి ఇండోనేషియా పెట్టింది పేరు అంతేకాకుండా భారతదేశానికి దగ్గర్లోనే ఉండడంతో తక్కువ రోజుల్లోనే టూర్‌ను ముగించుకోవచ్చు. ఇక కరెన్సీ విలువ వ్యత్యాసం వల్ల కూడా ఇక్కడ తక్కు ఖర్చులోనే మీ టూర్‌ను పూర్తి చేసకోవచ్చు.
కంబోడియా..
మన రూపాయి 49.40 కంబోడియన్ రియాల్‌కు సమానం. ప్రకృతి రమణీయతకు, దేవాలయాలకు పెట్టింది పేరైన కంబొబిడియా పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన దేశం. ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి పర్యాటకులు పెద్ద ఎత్తు వస్తుంటారు. మన కరెన్సీ విలువ ఈ దేశంలో ఎక్కువ కావడంతో తక్కువ బడ్జెట్‌లో టూర్‌ను పూర్తి చేసుకోవచ్చు.
వియత్నాం..
ప్రపంచవ్యాప్తంగా పర్యాటకానికి పెట్టింది పేరైన దేశాల్లో వియత్నాం ఒకటి. మన రూపాయి 292.87 వియత్నామీస్ డాంగ్‌లతో సమాననం. దీంతో వియత్నంలో టూర్‌ను ఎంచక్కా తక్కువ ఖర్చులోనే పూర్తి చేయొచ్చు. ఎన్నో అద్భుత పర్యాటక ప్రదేశాలకు పెట్టింది పేరైన వియత్నం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను రారమ్మంటూ ఆహ్వానిస్తుంటుంది.
శ్రీలంక..
తక్కువ బడ్జెట్‌లో ఫారిన్ టూర్ వేయాలనుకునే వారికి శ్రీలంక మరో బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఎన్నో ప్రకృతి రమణీయ ప్రాంతాలకు శ్రీలంక ఫేమస్. భారత్‌కు సమీప దేశం కావడంతో ప్రయాణ ఛార్జీలు కూడా తక్కువగానే ఉంటాయి. ఇక మన రూపాయి 3.93 శ్రీలం రూపాయిలతో సమానం. కాబట్టి తక్కువ బడ్జెట్‌లోనే టూర్‌ను ముగించవచ్చు.
నేపాల్..
భారత్‌కు సమీప దేశమైన నేపాల్‌లో కూడా రూపాయి విలువ అధికంగా ఉంది. ఇక్కడ మన రూపాయి 1.60 నేపాల్ రూపాయిలతో సమానం. ఎన్నో ప్రకృతి రమణీయమైన ప్రదేశాలకు పెట్టింది పేరైన నేపాల్‌లో పర్యటన మంచి అనుభూతిని ఇస్తుంది. భారత్‌కు అత్యంత చేరువలో ఉన్న ఈ దేశాన్ని తక్కువ బడ్జెట్‌లో సందర్శించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




