Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

South India Tourism: వేసవిలో సౌత్ ఇండియా ట్రిప్ వెళ్లాలా..? ఈ 9 ప్రదేశాలు వరల్డ్ ఫేమస్

వేసవి సెలవులు వస్తుండటంతో చాలా మంది ఉద్యోగులు లాంగ్ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటుంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్ ఇలా ఎవ్వరితోనైనా వెళ్లి హాయిగా వేసవి సెలవులు ఎంజాయ్ చేసి రావాలనుకుంటున్నారా.. అయితే ఈ ప్రదేశాలు మీకోసమే. వారికోసం దక్షిణ భారతదేశం ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి. ఇక్కడ చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ మీరు ఎప్పుడైనా ప్రకృతి అందాలను ఆస్వాదించి ఆనందించవచ్చు. పర్వతాలు, హిల్ స్టేషన్లు, సముద్రాలు,అనేక ఇతర ప్రదేశాలు ఉన్నాయి.

South India Tourism: వేసవిలో సౌత్ ఇండియా ట్రిప్ వెళ్లాలా..? ఈ 9 ప్రదేశాలు వరల్డ్ ఫేమస్
South India Touring Spots
Follow us
Bhavani

|

Updated on: Mar 14, 2025 | 6:24 PM

దక్షిణ భారతదేశం ఒక ఆధ్యాత్మిక అద్భుతమైన గమ్యస్థానం. ఇది ప్రకాశవంతమైన రంగులు, మనోహరమైన సంస్కృతులు, అందమైన ప్రకృతి దృశ్యాలను మిళితం చేస్తుంది. ఇవన్నీ పర్యాటకులు ఎప్పుడూ లేనంత గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. కేరళలోని పచ్చని తేయాకు తోటలు, బ్యాక్ వాటర్స్‌లో విహారయాత్ర చెప్పలేని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సుందరమైన దేవాలయాలు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలను చూసి ఆశ్చర్యపోవడం ఇక్కడికొచ్చే పర్యాటకుల వంతవుతుంది. దారిలో తీరప్రాంతాలు, సఫారీ పార్కులు, సందడిగా ఉండే మార్కెట్లు పొగమంచు దాగి ఉన్న పర్వత పట్టణాలను ఆస్వాదించవచ్చు. మరి సౌత్ ఇండియాలో అంతటి ప్రత్యేకమైన టూరింగ్ స్పాట్స్ ఎక్కడెక్కడున్నాయో మీరూ చూసేయండి.

గోకర్ణ, కర్ణాటక

గోకర్ణను ప్రస్తుతం మినీ గోవాగా పిలుస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో బీచ్‌ల వద్ద గడపాలంటే ఇది బెస్ట్ ప్లేస్. పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి.

వర్కలా, కేరళ

కేరళలోని పాపులర్ బీచ్ టౌన్ వర్కలా. ఇక్కడి ప్రశాంతమైన బీచ్‌లు ఎంతో బాగుంటాయి. పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. రిలాక్స్ అయ్యేందుకు మంచి చోటు.

కూర్గ్, కర్ణాటక

కూర్గ్ లేదా కొడగును స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇక్కడి కాఫీ తోటల పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం, అదిరిపోయే జలపాతాలు మీకు మంచి కిక్ ఇస్తాయి.

హంపి, కర్ణాటక

చరిత్రను ఇష్టపడేవారికి హంపి బెస్ట్ ఛాయిస్. తుంగభద్ర నది ఒడ్డున గల ఇక్కడి ఆలయాలు మీకు తప్పక నచ్చుతాయి. ఎంతో ప్రశాంతంగానూ ఉంటుంది.

పుదుచ్చేరి

సౌత్ ఇండియాలోని పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ పుదుచ్చేరి. ఇక్కడి ఫ్రెంచ్ కాలనీ, ప్రశాంతమైన బీచ్‌వు, అడ్వెంచర్ యాక్టివిటీస్ మీకు గొప్ప అనుభూతిని ఇస్తాయి.

అగస్త్యకూడమ్, కేరళ

సౌత్ ఇండియాలోని అత్యంత ఎత్తైన పర్వతంగా అగస్త్యకూడమ్‌కు గుర్తింపు ఉంది. ఈ పర్వతానికి చేరుకోవడానికి చేసే ట్రెక్కింగ్ చాలా బాగుంటుంది.

అరకు, ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లోని పాపులర్ హిల్ స్టేషన్ అరకు. ఇక్కడి కాఫీ తోటలు, ఆహ్లాదకరమైన వాతావరణం చాలా బాగుంటాయి. జలపాతాలు కూడా చూడొచ్చు. వ్యూ పాయింట్స్ అదిరిపోతాయి.

ఊటీ, తమిళనాడు

సౌత్ ఇండియాలోని పాపులర్ హిల్ స్టేషన్ ఊటీ. మార్చిలో ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి సరస్సులో బోటింగ్ చేయడం మంచి అనుభూతిగా నిలుస్తుంది.

మున్నార్, కేరళ

కేరళలోని పాపులర్ హిల్ స్టేషన్ మున్నార్. ఇక్కడి తేయాకు తోటల అందాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. వేసవిలో వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ట్రెక్కింగ్ కూడా అందుబాటులో ఉంటుంది.