IRCTC Tirupati Tour: శ్రీవారి భక్తులకు ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్.. వైజాగ్ నుంచి తిరుమల ట్రిప్. తాజా ప్యాకేజీ వివరాలు మీ కోసం..

|

Jan 20, 2023 | 3:05 PM

శ్రీవారి భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకుని వచ్చింది. తిరుపతి బాలాజీ దర్శనం పేరుతో ఈ టూర్ ప్యాకేజీని భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ ఏపీలోని విశాఖ పట్నం నుంచి ప్రారంభమై.. తిరుమల తిరుపతికి  చేరుకుంటుంది.

IRCTC Tirupati Tour: శ్రీవారి భక్తులకు ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్.. వైజాగ్ నుంచి తిరుమల ట్రిప్. తాజా ప్యాకేజీ వివరాలు మీ కోసం..
Irctc Tirupati Tour Package
Follow us on

కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి క్షేత్రం దర్శించుకోవాలని ప్రతిఒక్కరూ భావిస్తారు. కోనేటి రాయుడు దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమల క్షేత్రానికి పోటెత్తుతారు. స్వామివారిని దర్శించుకుని జన్మ తరించిందని పులకిస్తారు. శ్రీవారి భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకుని వచ్చింది. తిరుపతి బాలాజీ దర్శనం పేరుతో ఈ టూర్ ప్యాకేజీని భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ ఏపీలోని విశాఖ పట్నం నుంచి ప్రారంభమై.. తిరుమల తిరుపతికి  చేరుకుంటుంది. ఈ టూర్ ప్యాకేజీ జనవరి 27వ తేదీనుంచి ప్రారంభం కానుంది. మొత్తం నాలుగు రోజులు ఈ టూర్ ఉండనుంది. మూడు రాత్రులు.. నాలుగు పగళ్లు ఈ టూర్ ఉంటుంది. టూర్ లో భాగంగా కాణిపాకం, శ్రీపురం, తిరుమల, తిరుచానూరు, శ్రీకాళహస్తి క్షేత్రాలను దర్శించే వీలు కల్పిస్తోంది రైల్వే శాఖ. అంతేకాదు.. ఇక నుంచి ఐఆర్‌సీటీసీ ఈ తిరుపతి బాలాజీ దర్శనం టూర్ ప్యాకేజీని . ప్రతి శుక్రవారం ఆపరేట్ చేయనున్నది.

టూర్ ప్రారంభ తేదీ:

ఈ నెల 27వ తేదీనుంచి ప్రారంభమై..  3 రాత్రులు, 4 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ నెల 27వ తేదీన విశాఖ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు టూర్ ప్రారంభం అవుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మర్నాడు అంటే జనవరి 28వ తేదీ ఉదయం 04.5 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అనంతరం హెటల్ కి చెకిన్ అవుతారు. అక్కడ బ్రేక్ ఫాస్ట్ చేసి.. అనంతరం.. వినాయకుడు కొలువైన క్షేత్రం కాణిపాక వినాయకుడిని దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీ మహాలక్ష్మి దివ్య క్షేత్రం  శ్రీపురం వెళ్తారు. అయితే మధ్యాహ్నం భోజనం సొంత ఖర్చులతో చేయాల్సి ఉంటుంది. ఆరోజు తిరిగి హోటల్ కి చేరుకున్న తర్వాత ఆరోజు రాత్రి తిరుపతిలోనే బస చేయాల్సి ఉంటుంది.

జనవరి 29 వతేదీ ఉదయం 6 గంటలకు తిరుపతిలోని హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. బ్రేక్ ఫాస్ట్ చేసిన తరవాత ఉదయం 7 గంటలకు తిరుమల కొండకు చేరుకుంటారు. శ్రీవారి స్పెషల్ దర్శనం చేసుకుంటారు. కొండమీద మధ్యాహ్నం భోజనం చేయాల్సి ఉంటుంది. అనంతరం కొండ కిందకు వచ్చి.. అలివేలు మంగతాయారు కొలువైన తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. అక్కడ నుంచి ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తికి వెళ్లారు. దీంతో టూర్ ముగుస్తుంది. రాత్రి 8 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి తిరిగి సొంత ఊరు పయనం అవుతారు.

జనవరి 30వ తేదీ ఉదయం 11.30 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. దీంతో తిరుపతి బాలాజీ టూర్ కంప్లీట్ అవుతుంది.

ప్యాకేజీ ధరల వివరాలు: 

టూర్ ప్యాకేజీని త్రీ టైర్ ఏసీ(3AC) అందిస్తున్నారు. టూర్ ప్యాకేజీలో భాగంగా సింగింగ్ షేరింగ్ ధర రూ. 23,155

ఇద్దరికి ధర రూ. 14,245

ముగ్గురుకి రూ.12,000

5 ఏళ్ల నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారులకు స్పెషల్ టికెట్ ధరను ప్రకటించారు.

తిరుపతి బాలాజీ దర్శన ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ పూర్తి వివరాలకోసం బుకింగ్ కోసం అధికారిక ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ ను దర్శించాల్సి ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..