IRCTC Tour Package: వేసవి ఉపశమనం కోసం ఊటీ వెళ్లాలనుకుంటున్నారా.. ప్రతి వారం స్పెషల్ ట్రైన్.. డీటైల్స్
IRCTC ఈ టూర్ ప్యాకేజీని 'అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్' పేరుతో అందిస్తోంది. ఈ టూర్ మార్చి 28 నుండి జూన్ 27 వరకు ప్రతి మంగళవారం పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాల నుండి నడుస్తుంది.

వేసవిలో భానుడి వేడి నుండి ఉపశమనం పొందడానికి చాలా మంది చల్లని ప్రదేశాలకు వెళతారు. ముఖ్యంగా దక్షిణాది వారికి వేసవి అనగానే గుర్తొచ్చేది ఊటీ. ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి అందాలతో కూడిన ఊటీలో వేసవిలో విడిది చేస్తే అప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించలేము. అందుకే చాలా మంది ఊటీకి వెళ్ళడానికి ఇష్టపడతారు. అలాంటి వారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఊటీ ప్రయాణానికి సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. వేసవి వినోదం కోసం ఊటీ వెళ్లాలని ప్లాన్ చేస్తున్న తెలుగువారి కోసం ఆరు రోజుల పాటు సాగే ఈ టూర్ ప్యాకేజీ డీటైల్స్ ప్రకటించింది.
IRCTC ఈ టూర్ ప్యాకేజీని ‘అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్’ పేరుతో అందిస్తోంది. ఈ టూర్ మార్చి 28 నుండి జూన్ 27 వరకు ప్రతి మంగళవారం పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాల నుండి నడుస్తుంది. యాత్రికులు గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, తెనాలి రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఎక్కవచ్చు. ఊటీ ప్రయాణం పూర్తయ్యాక మళ్లీ ఆయా రైల్వే స్టేషన్లలో దిగవచ్చు. ఈ పర్యటన ఐదు రాత్రులు, ఆరు పగళ్ల పాటు కొనసాగుతుంది. ఈ రైలు మార్చి 28 నుండి వారానికి ఒకసారి సికింద్రాబాద్ నుండి బయలుదేరుతుంది. సమయం, టిక్కెట్ల లభ్యతను బట్టి మీకు నచ్చిన తేదీని ఎంచుకోవచ్చు. ఏప్రిల్ 25 టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి.. మే 2, 9, 16, 23, 30… ఈ రైలు జూన్ 27 వరకు ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. త్రీ-టైర్ AC, స్లీపర్ తరగతుల్లో ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
వారం రోజుల ప్రయాణం ఎలా జరుగుతుందంటే .. మొదటి రోజు: ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 12.20 గంటలకు బయలుదేరుతుంది. శబరి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం.17230)లో ప్రయాణించాల్సి ఉంటుంది.




రెండవ రోజు : రైలు ఉదయం 8 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటీకి చేరుకుంటారు. ముందుగా బుక్ చేసుకున్న హోటల్‌లో వసతి ఉంటుంది. సాయంత్రం పూట మీరు బొటానికల్ గార్డెన్స్, ఊటీ సరస్సు అందాలను చూడవచ్చు. రెండో రోజు ఊటీలోని హోటల్ రూమ్‌లో బస.
మూడవ రోజు: ఉదయం హోటల్‌లో అల్పాహారం తీసుకున్న తర్వాత, మాకు దొడబెట్ట శిఖరం, టీ మ్యూజియం చూడవచ్చు. తరువాత పాయికర జలపాతాన్ని దర్శించాలి. దీంతో మూడో రోజు పర్యటన పూర్తవుతుంది. రాత్రి మళ్లీ హోటల్‌లో బస చేయాల్సి ఉంటుంది.
నాల్గవ రోజు: ఉదయం అల్పాహారం తర్వాత ఊటీ సమీప ప్రాంతంలో పర్యటన చేయాల్సి ఉంటుంది. సాయంత్రం ఊటీకి తిరిగి చేరుకుంటారు. రాత్రిపూట మళ్లీ హోటల్‌లో బస చేయడంతో నాల్గవ రోజు పర్యటన ముగుస్తుంది.
ఐదవ రోజు: హోటల్‌లో అల్పాహారం చేసిన తర్వాత..మధ్యాహ్నం హోటల్ గదిని ఖాళీ చేయాలి. ఊటీ నుండి కోయంబత్తూర్ చేరుకుని..సాయంత్రం 4:35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఎఎక్కాల్సి ఉంటుంది.
ఆరో రోజు: మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ యాత్ర పూర్తవుతుంది.
ప్యాకేజీ ఛార్జీ వివరాలు: సింగిల్ షేరింగ్ కోసం ఒక్కొక్కరికి రూ. 31,410
డబుల్ షేరింగ్ కోసం ఒకొక్కరికి రూ.17,670
ట్రిపుల్ ఆక్యుపెన్సీకి ఒకొక్కరికి రూ. 14,330
5-11 సంవత్సరాల మధ్య పిల్లలకు ఒక్కొక్కరికి రూ.7650 చెల్లించాలి.
ప్యాకేజీలో ఇచ్చే సదుపాయాలు ఏమిటంటే? ఎంచుకున్న ప్యాకేజీపై ఆధారపడి.. రైలులో 3AC , స్లీపర్ క్లాస్ ప్రయాణం ఉంటుంది. అంతేకాదు ప్యాకేజీని బట్టి ప్రయాణానికి ఏసీ వాహనం ఏర్పాటు చేస్తారు. ఊటీలో మూడు రాత్రులు బస, AC గదులు , ఉచిత ఉదయం అల్పాహారం ఏర్పాటు చేస్తారు. ప్రయాణ బీమా సౌకర్యం అందుబాటులో ఉంది. టోల్ , పార్కింగ్ ఛార్జీలు ప్యాకేజీలో అంతర్భాగం.
అయితే మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం యాత్రికులే ఏర్పాటు చేసుకోవాలి. ఏదైనా పర్యాటక ప్రదేశంలో ఏదైనా ప్రవేశ రుసుము ఇవ్వాల్సి వస్తే.. పర్యాటకులే చెల్లించాల్సి ఉంటుంది. ఊటీలో బోటింగ్, గుర్రపు స్వారీ ప్యాకేజీలో చేర్చబడలేదు. గైడ్‌ని యాత్రికులే స్వయంగా ఏర్పాటు చేసుకోవాలి.
టికెట్ రద్దు వివరాలు.. IRCTC టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే.. కొన్ని రూల్స్ ను పాటించాలి. టూర్ కు 15 రోజుల ముందు టికెట్ రద్దు చేసుకోవాలంటే, ఒక్కో టిక్కెట్‌కు రూ.250 క్యాన్సిలేషన్ ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది.
అదే ఎనిమిది నుండి 14 రోజులలోపు టికెట్ మొత్తం ధరలో 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది.
4 నుండి 7 రోజులలోపు టిక్కెట్ ధర నుండి 50 శాతం డబ్బు తీసుకుంటారు. అదే టూర్ మొదలు కావడానికి నాలుగు రోజుల ముందు టిక్కెట్‌ను రద్దు చేసుకున్నట్లు అయితే డబ్బులు వాపసు ఇవ్వబడదు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..