IRCTC Tour Package for Japan: ఐఆర్‌సీటీసీ నుంచి జపాన్ టూర్ ప్యాకేజీ.. బడ్జెట్ ఎంతో తెలుసా..?
ఈ టూర్ ప్యాకేజీలో మీకు అనేక రకాల సౌకర్యాలు లభిస్తాయి. దీనిలో మీరు ఆహారం, పానీయాల కోసం పూర్తి ఏర్పాట్లు, ఉత్తమ హోటళ్లలో బస చేసే సౌకర్యం, ప్రయాణ బీమా, స్థానిక ప్రయాణానికి బస్సు సౌకర్యం పొందుతారు. దీనితో పాటు ప్రయాణికులకు ప్రతి ప్రదేశం..

IRCTC Tour Package for Japan: మీరు ప్రయాణం చేయడం ఇష్టపడితే IRCTC మీకు గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ఐఆర్‌సీటీసీ ఈ అద్భుతమైన టూర్ ప్యాకేజీతో మీరు ఆసియాలోని అందమైన దేశాన్ని సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ ముఖ్యంగా జపాన్ అందాలను దగ్గరగా చూడాలనుకునే వారి కోసం. ఈ టూర్ ప్యాకేజీ పేరు “SPLENDOURS OF JAPAN-CHERRY BLOSSOM”. దీని కోడ్ SMO63. ఈ టూర్ గురించి తెలుసుకుందాం.
మార్చి 20 నుండి ప్రారంభం:
ఐఆర్‌సీటీసీ ఈ టూర్ ప్యాకేజీ మార్చి 20న చెన్నై నుండి ప్రారంభమై మార్చి 27న ముగుస్తుంది. ఈ టూర్ ప్యాకేజీలో 7 రాత్రులు, 8 పగళ్ల పాటు జపాన్‌లోని ముఖ్యమైన ప్రదేశాలకు తీసుకెళ్తారు. ఈ సమయంలో మీరు టోక్యో, హకోన్, హమామట్సు, హిరోషిమా, ఒసాకా వంటి ప్రసిద్ధ నగరాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. దీనితో పాటు మీరు మౌంట్ ఫుజి, అసకుసా పుణ్యక్షేత్రం, యోయోగి పార్క్ చెర్రీ బ్లోసమ్, MT ఫుజి 5వ స్టేషన్, టయోటా మ్యూజియం, స్కామాగ్లేవ్, రైల్వే పార్క్, కింకాకుజీ (గోల్డెన్ పెవిలియన్) లను సందర్శించే అవకాశం కూడా పొందుతారు.
టూర్ ప్యాకేజీలో ఉన్న సౌకర్యాలు:
ఈ టూర్ ప్యాకేజీలో మీకు అనేక రకాల సౌకర్యాలు లభిస్తాయి. దీనిలో మీరు ఆహారం, పానీయాల కోసం పూర్తి ఏర్పాట్లు, ఉత్తమ హోటళ్లలో బస చేసే సౌకర్యం, ప్రయాణ బీమా, స్థానిక ప్రయాణానికి బస్సు సౌకర్యం పొందుతారు. దీనితో పాటు ప్రయాణికులకు ప్రతి ప్రదేశం గురించి సమాచారం అందించే గైడ్ కూడా మీకు లభిస్తుంది.
టూర్ ప్యాకేజీ ధర:
ఈ టూర్ ప్యాకేజీ ఖర్చు ఒక్కొక్కరికి రూ.3,90,600. ఇద్దరు వ్యక్తులకు ఈ మొత్తం ఒక్కొక్కరికి రూ. 2,98,500. ముగ్గురు వ్యక్తులకు ఇది ఒక్కొక్కరికి రూ.2,93,500. 5 నుంచి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు (బెడ్‌తోతో) ఇది రూ. 2,64,500. 5 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు (బెడ్ లేకుండా) ఇది రూ. 2,41,600.
మీరు బుకింగ్ ఎలా చేస్తారు?
ఈ అద్భుతమైన టూర్ ప్యాకేజీని మీరు సద్వినియోగం చేసుకోవాలనుకుంటే మీరు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. బుకింగ్, మరిన్ని వివరాల కోసం మీరు ఐఆర్‌సీటీసీ లింక్‌ను సందర్శించవచ్చు.
మరిన్ని టూరిజం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
