AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: అయ్యప్ప భక్తులకు గుడ్‌ న్యూస్‌.. తక్కువ ధరలో శబరికి టూర్‌ ప్యాకేజీ

శబరిమల వెళ్లాలనుకుంటోన్న అయ్యప్త భక్తుల కోసం ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైల్వే కేటరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూరిజం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంచి అవకాశాన్ని తీసుకొచ్చింది. భారత్‌ గౌరవ్‌ టూరిస్టు రైళ్లలో భాగంగా శబరికి ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఈ టూర్ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ప్యాకేజీ ధర ఎంత? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

IRCTC: అయ్యప్ప భక్తులకు గుడ్‌ న్యూస్‌.. తక్కువ ధరలో శబరికి టూర్‌ ప్యాకేజీ
Irctc
Narender Vaitla
|

Updated on: Oct 23, 2024 | 6:55 AM

Share

శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శించుకోవాలని ఎంతో ఆశతో ఉంటారు అయ్యప్పస్వామి భక్తులు. అలాంటి వారి కోసమే ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైల్వే కేటరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూరిజం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (IRCTC) మంచి ఛాన్స్‌ తీసుకొచ్చింది. ఎలాంటి టెన్షన్‌ లేకుండా శబరిమల యాత్ర పూర్తి చేసుకునేలా అవకాశం కల్పించింది. భారత్‌ గౌరవ్‌ టూరిస్టు రైళ్ల ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించి ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. నవంబర్‌ 16 నుంచి 20వ తేదీ వరకు కొనసాగనున్న ఈ యాత్రకు సంబంధించిన బ్రోచర్‌ను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ జైన్‌ సోమవారం విడుదల చేశారు. ఇంతకీ ప్రయాణం ఎలా సాగుతుంది.? ఛార్జీలు ఎలా ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం..

* నవంబర్‌ 16వ తేదీన ఉదయం 8గంటలకు ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌ నుంచి బయలు దేరుతుంది. రాత్రంగా ప్రయాణం ఉంటుంది.

* రెండోరోజు ఉదయం 7 గంటలకు కేరళలోని చెంగనూర్‌కు చేరుకుంటుంది. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నీలక్కళ్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆర్టీసీ బస్సులో పంబ వరకు ప్రయాణం ఉంటుంది. రాత్ర బస అక్కడే ఉంటుంది.

* ఇక మూడో రోజు దర్శనం, అభిషేకంలో పాల్గొంటారు. అనంతరం మధ్యహ్నం 1 గంటకల్లా నీలక్కళ్‌నుంచి చోటానిక్కర/ఎర్నాకుళం చేరుకుంటారు. రాత్రి బస అక్కడే ఉంటుంది.

* 4వ రోజు ఉదయం 7గంటలకు చోటానిక్కర అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత స్థానికంగా ఉండే రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. మధ్యాహ్నంగా 12 గంటలకు రైలు బయలుదేరి అదే రోజు రాత్రి 9.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ఛార్జీలు ఇలా..

ప్యాకేజీ ఛార్జీల విషయానికొస్తే.. ఎకానమీ (SL) కేటగిరీలో ఒక్కో టికెట్‌ ధర రూ.11,475గా నిర్ణయించారు. ఇక 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు రూ. 10,655గా నిర్ణయించారు. అదే స్టాండర్డ్‌ (3AC)కేటగిరీ విషయానికొస్తే రూ. 18,790గా, 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.17,700గా నిర్ణయించారు. కంఫర్ట్‌ (2AC) ప్యాకేజీ ధర రూ.24,215 కాగా 5 నుంచ 11 ఏళ్ల చిన్నారులకు రూ. 22,910గా నిర్ణయించారు. ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ప్యాకేజీలో కవర్‌ అవుతుంది. అయితే ఎంట్రీ ఫీజులు ప్యాకేజీలో కవర్‌ అవ్వవు.

మరిన్న టూరిజ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
50 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్కూల్ ఫ్రెండ్స్..1976 బ్యాచ్ రీయూనియన్
50 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్కూల్ ఫ్రెండ్స్..1976 బ్యాచ్ రీయూనియన్
ఏపీలో పేషెంట్లకు గుడ్‌న్యూస్‌.. రూ.75 వేల విలువ టెస్ట్‌ ఉచితం..!
ఏపీలో పేషెంట్లకు గుడ్‌న్యూస్‌.. రూ.75 వేల విలువ టెస్ట్‌ ఉచితం..!
జై గణేశా.. జై జై గణేశా..! వినాయకుడికి హెలికాప్టర్‌తో పూల వర్షం..
జై గణేశా.. జై జై గణేశా..! వినాయకుడికి హెలికాప్టర్‌తో పూల వర్షం..
యజమాని అంతిమ యాత్రలో శునకం..
యజమాని అంతిమ యాత్రలో శునకం..
ఈ వారం ఓటీటీలోకి టెన్షన్ పుట్టించే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు..
ఈ వారం ఓటీటీలోకి టెన్షన్ పుట్టించే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు..
వెస్టిండీస్‌తో తొలి వన్డే.. ఓపెనర్లుగా ఎవరంటే?
వెస్టిండీస్‌తో తొలి వన్డే.. ఓపెనర్లుగా ఎవరంటే?
నీటి గెడ్డలో ఏదో కదలిక.. ఏంటా అని వెళ్లి చూడగా..
నీటి గెడ్డలో ఏదో కదలిక.. ఏంటా అని వెళ్లి చూడగా..
రాజకీయాల్లోకి టీమిండియా స్టార్ ప్లేయర్.. ఆర్ఎల్‌డీ చీఫ్‌తో భేటీ
రాజకీయాల్లోకి టీమిండియా స్టార్ ప్లేయర్.. ఆర్ఎల్‌డీ చీఫ్‌తో భేటీ
జామకాయతో ఎప్పుడైనా ఇలా కూర చేశారా? 10 నిమిషాల్లో ప్రోటీన్, ఫైబర్
జామకాయతో ఎప్పుడైనా ఇలా కూర చేశారా? 10 నిమిషాల్లో ప్రోటీన్, ఫైబర్
ఏమి తినబుద్ది కానప్పుడు ఇది ట్రై చేయండి.. వేడి అన్నంలో తింటుంటే..
ఏమి తినబుద్ది కానప్పుడు ఇది ట్రై చేయండి.. వేడి అన్నంలో తింటుంటే..