వేసవి సెలవులు వచ్చేశాయి. వినోదం కోసం లేదా రెగ్యులర్ లైఫ్ కి దూరంగా పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్ళడానికి అనేకమంది ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో షిర్డీ కి వెళ్లాలనే భక్తుల కోసం తెలంగాణ టూరిజం శాఖ సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. మహారాష్ట్రలోని షిర్డీకి భారీ సంఖ్యలో భక్తులు వెళ్తూ ఉంటారు. సాయిబాబా సమాధిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకుంటారు. పవిత్ర పుణ్యక్షేత్రం షిర్డీ సాయి దర్శనం కోసం వెళ్లే తెలంగాణ వాసుల కోసం తెలంగాణ టూరిజం వివిధ ప్యాకేజీలను తీసుకొచ్చింది.
హైదరాబాద్ నుంచి షిర్డీకి వెళ్లే వారి కోసం తెలంగాణా టూరిజం శాఖ రెండు రెండు వేర్వేరు ప్యాకేజీలను ప్రకటించింది.
AC , నాన్-AC. ఏసీ బస్సులను ఏర్పాటు చేసింది. ఏసీ బస్సులో ప్రయాణించాలనుకునే భక్తులకు టికెట్ ధరలను పెద్దలకు రూ.3,700, పిల్లలకు రూ.3,010గా నిర్ణయించింది. నాన్ ఏసీ బస్సుల్లో పెద్దలకు రూ.2,400, పిల్లలకు రూ.1,970గా నిర్ణయించారు.
పర్యాటకులకు కల్పించే సౌకర్యాలు
షిర్డీ చేరుకున్న తర్వాత.. ఫ్రెష్ అప్ అవ్వడానికి హోటల్ గదిని ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ లోని విధ ప్రాంతాలనుంచి బస్సులు బయలు దేరి ఉదయం 7 గంటలకు షిర్డీకి చేరుకుంటాయి. అక్కడ ఏర్పాటు చేసిన హోటల్ లో ప్రయాణికులు బస చేయాల్సి ఉంటుంది. ఇక్కడ భక్తులు సిద్ధమైన తర్వాత బస్సుల్లో సాయిబాబా దర్శనానికి బయలుదేరాల్సి ఉంటుంది. ప్రధాన దర్శనం తర్వాత, సమీపంలోని మరికొన్ని ఆలయాలను కూడా సందర్శించవచ్చు.
అనంతరం బస్సు షిర్డీ నుండి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
A budget-friendly tour package to Shirdi from Hyderabad at just ₹3700 for adult and ₹3010 for child. The package includes seamless travel in AC sleeper coach and comfortable accommodation. Visit: https://t.co/K2QmUp7w3z | 1800-425-46464#ShirdiTour #SleeperBus #TelanganaTourism pic.twitter.com/5gpstnAoX9
— Telangana State Tourism (@tstdcofficial) April 26, 2023
ఎక్కడ నుంచి ప్రారంభం కానున్నదంటే..
ఈ పర్యటన రెండు రాత్రులు, ఒక రోజు ఉండనుంది. హైదరాబాద్ లోని దిల్‌షుక్‌నగర్, బషీర్‌బాగ్, ప్యారడైజ్, బేగంపేట్, KPHB , మియాపూర్ నుండి ప్రత్యేక పికప్ పాయింట్ల నుంచి బస్సులు సాయంత్రం షిర్డీకి బయలు దేరతాయి.
ప్యాకేజీలో మినాయింపు
ఈ పర్యటనలో షిర్డీ వెళ్లే భక్తులు ముందుగానే బాబా దర్శనం కోసం ఆలయ అధికారిక వెబ్‌సైట్‌లో దర్శన టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవాలని సూచించారు. అంతేకాదు.. ఆహారం, ఆలయ ప్రవేశ టిక్కెట్లు ప్యాకేజీలో చేర్చలేదు.
ఈ టూర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు https://tourism.telangana.gov.in/package/ShirdiTour ను సందర్శించాల్సి ఉంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..