మే 10నుంచి చార్ ధామ్ యాత్ర మొదలు.. రిజిస్ట్రేషన్ నుంచి టూర్‌కు సంబంధించిన వివరాలు మీకోసం

|

Apr 20, 2024 | 4:46 PM

హిందూ మతంలో చార్‌ధామ్ యాత్ర చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. జీవితంలో ఒక్కసారైనా తప్పనిసరిగా చార్‌ధామ్ యాత్ర చేయాలని భావిస్తారు. ప్రస్తుతం 2024లో చార్‌ధామ్ తీర్థయాత్ర చేయాలనుకుంటున్నట్లు అయితే దీనికి ముందు మీరు టూర్ ప్యాకేజీ నుంచి రిజిస్ట్రేషన్ వరకు ఎలాంటి సన్నాహాలు చేసుకోవాలో తెలుసుకుందాం.. 

మే 10నుంచి చార్ ధామ్ యాత్ర మొదలు.. రిజిస్ట్రేషన్ నుంచి టూర్‌కు సంబంధించిన వివరాలు మీకోసం
Char Dham Yatra 2024
Image Credit source: unsplash
Follow us on

ఈ సంవత్సరం అంటే 2024 చార్ ధామ్ యాత్ర (గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్) మే 10 నుంచి  ప్రారంభమవుతుంది. హిందూ మతంలో చార్‌ధామ్ యాత్ర విశ్వాసంతో అనుసంధానించబడి ఉంది. దీంతో  చార్‌ధామ్‌ను సందర్శించడానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కొందరు వ్యక్తులు చార్‌ధామ్‌ను స్వయంగా సందర్శించాలని కోరుకుంటారు. చాలామంది తమ వృద్ధ తల్లిదండ్రులను చార్‌ధామ్ తీర్థయాత్రకు తీసుకుని వెళ్లాలని కోరుకుంటారు. ఈ సంవత్సరం చార్‌ధామ్ యాత్రను ప్లాన్ చేస్తుంటే, ప్రయాణం మొదటి రోజు నుంచి దర్శనం వరకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందుగానే కొన్ని సన్నాహాలు చేసుకోవడం ముఖ్యం.

హిందూ మతంలో చార్‌ధామ్ యాత్ర చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. జీవితంలో ఒక్కసారైనా తప్పనిసరిగా చార్‌ధామ్ యాత్ర చేయాలని భావిస్తారు. ప్రస్తుతం 2024లో చార్‌ధామ్ తీర్థయాత్ర చేయాలనుకుంటున్నట్లు అయితే దీనికి ముందు మీరు టూర్ ప్యాకేజీ నుంచి రిజిస్ట్రేషన్ వరకు ఎలాంటి సన్నాహాలు చేసుకోవాలో తెలుసుకుందాం..

IRCTC చార్‌ధామ్ టూర్ ప్యాకేజీ

భక్తులకు చార్‌ధామ్ యాత్రను సులభతరం చేయడానికి.. IRCTC మే 25 నుంచి ప్రారంభమయ్యే ‘చార్‌ధామ్ యాత్ర ఉత్తరాఖండ్’ పేరుతో ఒక టూర్ ప్యాకేజీతో ముందుకు వచ్చింది. ఈ ప్యాకేజీ మధ్యప్రదేశ్ నివాసితులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది భోపాల్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ 12 రోజుల టూర్ ప్యాకేజీలో భక్తులు గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను మాత్రమే కాకుండా బార్‌కోట్, జాంకిచట్టి, ఉత్తరకాశీ, గుప్తేశ్వర్, సోన్‌ప్రయాగ్, హరిద్వార్‌లను కూడా సందర్శించ వచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో సందర్శనాతో పాటు, ఆహారం, వసతి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఈ టూర్ ప్యాకేజీలో ఒక్కొక్కరికి రూ.95,150, ఇద్దరు వ్యక్తులుంటే రూ.62,950, ముగ్గురు ఉంటే రూ.56850 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు రూ.38,650. అదే వయస్సులో ఉన్న పిల్లలకు బెడ్ లేని వారి ఛార్జీ రూ.28900గా నిర్ణయించారు. ఎవరైనా ఈ టూర్  ప్యాకేజీలో బుక్ చేసుకోవాలనుకుంటే ‘Irctc టూరిజం’ సైట్‌ని సందర్శించడం ద్వారా ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

యాత్రకు ముందు నమోదు అవసరం

చార్‌ధామ్ యాత్ర చేయాలనుకునేవారు తప్పని సరిగా బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలి. ఇలా చేయడం  తప్పనిసరి. కనుక మీరు ముందుగానే నమోదు చేసుకోవాలి. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని డెహ్రాడూన్ స్మార్ట్ పోర్టల్ నుంచి పొందవచ్చు. రిజిస్ట్రేషన్లు వేగంగా జరుగుతున్నాయి. ఎవరైనా  registrationandtouristcare.uk.gov.inని సందర్శించి నమోదు చేసుకోవాలి. ఇందులో మీరు పేరు, మొబైల్ నంబర్, చిరునామా వంటి ముఖ్యమైన వివరాలను ఇవ్వాలి.

ఏ పత్రాలను దగ్గరకు ఉంచుకోవాలంటే

చార్‌ధామ్ యాత్ర కోసం సామాన్లు ప్యాకింగ్ చేసేటప్పుడు.. వెచ్చని బట్టలు, రెయిన్ కోట్ వంటి వస్తువులను ప్యాకింగ్ చేసేటప్పుడు, గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎటువంటి పత్రాన్ని వదిలివేయకూడదు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ముఖ్యమైన కార్డులను మీ వద్ద ఉంచుకోండి.

చార్‌ధామ్ ఎలా చేరుకోవాలి

చార్‌ధామ్ యాత్రను ప్రారంభించడానికి మీ నగరం లేదా గ్రామం నుంచి రైలు, విమాన లేదా రోడ్డు మార్గంలో డెహ్రాడూన్, రిషికేశ్, హరిద్వార్‌లకు చేరుకోవచ్చు. దీని తరువాత అక్కడ నుంచి టాక్సీలు, ప్రైవేట్ బస్సులు మొదలైనవి తీసుకోవచ్చు. అయితే సహస్త్రధార హెలిప్యాడ్ (డెహ్రాడూన్ నుంచి ఖర్సాలీ), గుప్తకాశీ హెలిప్యాడ్ (కేదార్నాథ్, బద్రీనాథ్). దీని కోసం మీరు IRCTC ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. హెలీ సర్వీసుల ఛార్జీలు కూడా 5 శాతం పెరిగినట్లు సమాచారం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..