Travel India: దసరా సెలవుల్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. బెస్ట్ ప్లేసెస్ లిస్టు మీ కోసం

|

Oct 01, 2024 | 7:47 PM

అక్టోబరు నెల ప్రయాణానికి చాలా మంచిది. ఎందుకంటే ఈ నెలలో వాతావరణం మారడం ప్రారంభమవుతుంది. వేడి నుండి ఉపశమనం కలుగుతుంది. తేలికపాటి చల్లటి గాలులు వీస్తాయి. అటువంటి పరిస్థితిలో మీరు మీ కుటుంబం లేదా స్నేహితులతో కలిసి ప్రయాణం చేయడానికి ప్లాన్ చేయవచ్చు. ఈ రోజు అక్టోబర్ నెలలో మీ కుటుంబంతో కలిసి వెళ్లగలిగే మన దేశంలోని కొన్ని అందమైన ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.. అక్కడ వాతావరణం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. అంతేకాదు కుటుంబంతో కలిసి ఆనందించవచ్చు.

Travel India: దసరా సెలవుల్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. బెస్ట్ ప్లేసెస్ లిస్టు మీ కోసం
Travel India
Image Credit source: TONNAJA/Moment/Getty Images
Follow us on

అక్టోబరు నెల ప్రయాణానికి చాలా మంచిది. ఎందుకంటే ఈ నెలలో వాతావరణం మారడం ప్రారంభమవుతుంది. వేడి నుండి ఉపశమనం కలుగుతుంది. తేలికపాటి చల్లటి గాలులు వీస్తాయి. అటువంటి పరిస్థితిలో మీరు మీ కుటుంబం లేదా స్నేహితులతో కలిసి ప్రయాణం చేయడానికి ప్లాన్ చేయవచ్చు. ఈ రోజు అక్టోబర్ నెలలో మీ కుటుంబంతో కలిసి వెళ్లగలిగే మన దేశంలోని కొన్ని అందమైన ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.. అక్కడ వాతావరణం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. అంతేకాదు కుటుంబంతో కలిసి ఆనందించవచ్చు.

జీరో అరుణాచల్ ప్రదేశ్

అరుణాచల్ ప్రదేశ్‌లోని జీరో ప్రదేశాన్ని సందర్శించవచ్చు. ఇక్కడ ప్రశాంతంగా సమయం గడపడానికి ఇది సరైన ప్రదేశం. ఈ నగరం చుట్టూ ఉన్న పర్వతాలు, పచ్చదనంతో ఉన్న సహజ దృశ్యం మనస్సును ఆకర్షిస్తుంది. ఫిష్ ఫార్మ్ కలెక్షన్, పైనీ గ్రోవ్, టిపి ఆర్కిడ్ రీసెర్చ్ సెంటర్, కమాన్ డోలో, మిడి, జీరో ప్లూటో వంటి ప్రదేశాలను సందర్శించడానికి ఇక్కడకు వెళ్లవచ్చు.

లాచెన్ సిక్కిం

సిక్కింలో లాచెన్ చాలా అందమైన ప్రదేశం. శీతాకాలంలో ఇది మంచుతో కప్పబడి ఉంటుంది. వేసవిలో ఇక్కడ పచ్చదనం కనిపిస్తుంది. లాచెన్‌లో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. లాచెన్ మొనాస్టరీ, సింగ్బా రోడోడెండ్రాన్ అభయారణ్యం, చోప్తా వ్యాలీ, థంగు వ్యాలీ, త్సో లామో లేక్, లొనాక్ వ్యాలీ వంటి ప్రదేశాలను అన్వేషించవచ్చు. స్నేహితులతో కలిసి లేదా ఒంటరిగా కూడా ఇక్కడకు విహారయాత్రకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

బీర్ బిల్లింగ్

ఉత్తర హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న బిర్ బిల్లింగ్ కూడా చూడదగిన అందమైన ప్రదేశాలలో ఒకటి. ఈ నగరం ట్రెక్, పారాగ్లైడింగ్, ధ్యానం వంటి కార్యకలాపాలకు చాలా ప్రసిద్ధి చెందింది. బిర్ ల్యాండింగ్ సైట్, చోక్లింగ్ మొనాస్టరీ, బిగ్ టీ ఫ్యాక్టరీ, డీర్ పార్క్ ఇన్స్టిట్యూట్, గునేహర్ జలపాతం, రాజ్‌గుంధ వ్యాలీ, టేక్ ఆఫ్ సైట్ బిర్ బ్లింగ్ వంటి ప్రదేశాలను సందర్శించడానికి ఇక్కడకు వెళ్లవచ్చు.

స్పితి వ్యాలీ హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీని సందర్శించడానికి కూడా వెళ్ళవచ్చు. ఇక్కడ స్నేహితులతో ట్రెక్కింగ్ కు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఫోటోగ్రఫీని ఇష్టపడితే ఇక్కడ చంద్రశిలకి వెళ్లవచ్చు. ఇది చాలా అద్భుతమైన ప్రదేశం. అంతేకాదు సూరజ్ తాల్, ధంకర్ సరస్సు, కుంజుమ్ పాస్ , పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ వంటి అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు. మీరు ట్రెక్కింగ్ చేయాలనుకుంటే, ఈ ప్రదేశం మీకు సరైన ఎంపిక.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..