Octopus: పుడుతూనే తల్లిని, పుట్టిన కొంతకాలానికి తండ్రిని కోల్పోయే ఈ సముద్ర జీవి గురించి మీకు తెల్సా

|

May 26, 2022 | 4:05 PM

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ఆక్టోపస్ శరీరంలో ఈ మార్పులు సంభవించినప్పుడు, అవి పిచ్చిగా ప్రవర్తించడం ప్రారంభిస్తాయి. తమను తాము హాని చేసుకుని మరణాన్ని పొందుతాయి. ఇలా ఆడ ఆక్టోపస్ అకాల మరణానికి వాటిలో ఉన్న ఆప్టిక్ గ్రంధి బాధ్యత వహిస్తుంది.

Octopus: పుడుతూనే తల్లిని, పుట్టిన కొంతకాలానికి తండ్రిని కోల్పోయే ఈ సముద్ర జీవి గురించి మీకు తెల్సా
Octopus Reproduction
Follow us on

Octopus Reproduction: సముద్రంలో అనేక రకాల జీవులున్నాయి. వాటిల్లో ఒకటి ఆక్టోపస్‌లు. అయితే ఈ ఆక్టోపస్ లు ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 జాతులు ఉన్నాయి. ఇవి ఆకారంలోనే కాదు జీవితంలో కూడా భిన్నంగా ఉంటాయి. ఆడ ఆక్టోపస్‌లు గుడ్లు పెట్టిన అనంతరం ఆత్మహాత్య చేసుకుంటారు. తమ పిల్లలని తమ జీవితంలో ఒక్కసారి కూడా చూడలేవు. అయితే అవి ఇలా  ఆత్మహత్యా చేసుకునే పద్దతి తెలిసే ఎవరికైనా గూస్‌బంప్స్‌ రావడం ఖాయం. ఆక్టోపస్‌పై ఇటీవలి పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆడ ఆక్టోపస్ గుడ్డు పెట్టిన తర్వాత తనను తాను చంపే ప్రక్రియ మొదలవుతుందని.. ఇలా ఎందుకు. ఎలా జరుగుతుందో తెలుసుకుంటామని చికాగో యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.

ఆడ ఆక్టోపస్ గుడ్లు పెట్టిన తర్వాత క్రమంగా ఆహారం తీసుకోవడం మానేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు తమకు తామే హాని చేసుకోవడం ప్రారంభిస్తాయి. శరీరం నుండి చర్మాన్ని విడిచి పెట్టడంతో చావుని ఆహ్వానిస్తుంది. అలా ఆడ ఆక్టోపస్ నుంచి గుడ్డు నుండి దాని పిల్లలు బయటకు వచ్చే సమయానికి మరణిస్తుంది. అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే… కొంతకాలం తర్వాత పిల్లల తండ్రి అంటే మగ ఆక్టోపస్ కూడా మరణిస్తుంది.

మగ, ఆడ ఆక్టోపస్‌లు సహజీవనం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. సంభోగం అనంతరం ఆడ ఆక్టోపస్ లోని  హార్మోన్లు కొలెస్ట్రాల్‌తో సంబంధం ఉన్న జీవరసాయన పని తీరుపై ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా ఆడ ఆక్టోపస్  శరీరంలో ఆప్టిక్ గ్రంథి ఉంటుంది. మగ, ఆడ మధ్య సంభోగం అనంతరం ఈ గ్రంథి ఎక్కువ సెక్స్ హార్మోన్లు, ఇన్సులిన్,  కొలెస్ట్రాల్‌లను తయారు చేయడం ప్రారంభిస్తుంది. ఈ మూడు అణువులు ఆడ ఆక్టోపస్ మరణానికి కారణమవుతాయి.

ఇవి కూడా చదవండి

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం..  ఆక్టోపస్ శరీరంలో ఈ మార్పులు సంభవించినప్పుడు, అవి పిచ్చిగా ప్రవర్తించడం ప్రారంభిస్తాయి. తమను తాము హాని చేసుకుని మరణాన్ని పొందుతాయి. ఇలా ఆడ ఆక్టోపస్ అకాల మరణానికి వాటిలో ఉన్న ఆప్టిక్ గ్రంధి బాధ్యత వహిస్తుంది.

సైన్స్ అలర్ట్ నివేదికలో..  చికాగో విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆక్టోపస్ శరీరం నుండి ఈ గ్రంథిని తొలగిస్తే, అది అంత త్వరగా చనిపోదని చెప్పారు. ఈ గ్రంథిని తొలగిస్తే ఆడ ఆక్టోపస్ గుడ్లు పెట్టిన తర్వాత కూడా  చాలా నెలలు జీవించగలదని పేర్కొన్నారు. ఈ విషయం పరిశోధనలో కూడా రుజువైంది.

మరిన్ని లైఫ్ స్టైల్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..