Sesame Oil: శరీరానికి నువ్వుల నూనె పట్టించి స్నానం చేస్తే జరిగేది ఇదే..

ఇప్పుడంటే ఆయిల్స్‌లో అనేక రకాలు వచ్చాయి. కానీ ఇంతకు ముందు మాత్రం శరీరానికి, జుట్టుకు, వంటల్లో కూడా నువ్వుల నూనెను ఉపయోగించేవారు. నువ్వుల నూనె రాసుకోవడం వల్ల అనేక సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు..

Sesame Oil: శరీరానికి నువ్వుల నూనె పట్టించి స్నానం చేస్తే జరిగేది ఇదే..
Sesame Oil
Follow us
Chinni Enni

|

Updated on: Nov 20, 2024 | 6:17 PM

నువ్వులు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వులను అనేక రకాల వంటల్లో కూడా ఉపయోగించి చేస్తూ ఉంటారు. నువ్వుల్లో అనేక రకాల పోషకాలు, ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. నువ్వులతో కేవలం ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. నువ్వులే కాకుండా నువ్వుల నూనెను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. నువ్వుల నూనెను ఎక్కువగా దీపారాధనకు, జుట్టుకు పట్టించడానికి, చర్మానికి రాసుకోవడాని ఉపయోగిస్తారు. నువ్వుల నూనె రాయడం వల్ల ఎన్నో రకాల చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ శీతా కాలంలో నువ్వుల నూనెను చర్మానికి రాసుకోవడం వల్ల చాలా సమస్యలకు చెక్ పెట్టొచ్చు. శరీరానికి మొత్తం నువ్వుల నూనె పట్టించడం వల్ల.. ఎన్నో రోగాలు రాకుండా ఉంటాయి. నువ్వుల నూనెను ఆయుర్వేదంలో కూడా పలు రకాల సమస్యలను కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు. నువ్వుల నూనెలో పలు రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. నువ్వుల నూనె రాసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖం మెరుస్తూ:

నువ్వుల నూనెను రాత్రి పడుకునే ముందు ముఖానికి బాగా పట్టించాలి. ఇలా ప్రతి రోజూ చేస్తే మీ ముఖం మెరుస్తూ.. యవ్వనంగా కనిపిస్తారు. కొద్ది రోజులు చేయగానే మీకు ఫలితం కనిపిస్తుంది.

చిన్నారులకు బెస్ట్:

నువ్వుల నూనెతో చిన్నారులకు బాడీ మసాజ్ చేస్తే చాలా మంచిది. తలకు, ఒంటికి బాగా పట్టించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. శరీర నొప్పులు వంటివి తగ్గి.. చర్మం కాంతి వంతంగా అందగా కనిపిస్తారు. నువ్వుల నూనెలో విటమిన్స్, మినరల్స్ వంటివి చక్కగా ఉంటాయి. మెదడు ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది. వెన్నుముక, కండరాలు బల పడేందుకు సహాయ పడుతుంది. పెదాలు కూడా పొడిబారకుండా ఉంటుంది. చర్మం ఎంతో కోమలంగా, మృదువుగా మారుతుంది. చిన్నారులు చాలా యాక్టీవ్‌గా ఉంటారు.

ఇవి కూడా చదవండి

బీపీ కంట్రోల్:

నువ్వుల నూనెతో చర్మాన్ని మసాజ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా మారుతుంది. గుండె పని తీరు మెరుగు పడుతుంది. త్వరగా హార్ట ఎటాక్‌లు వంటివి రాకుండా ఉంటాయి.

శరీర వాపులు తగ్గుతాయి:

శరీర వాపులతో బాధ పడేవారు కొద్ది రోజులు నువ్వుల నూనెతో శరీరం అంతా మర్దనా చేసుకుంటే వాపులు కంట్రోల్ చేయడమే కాకుండా.. కీళ్లనొప్పులను కూడా తగ్గిస్తాయి. కీళ్లు, రక్త నాళాలు దృఢంగా మారతాయి. మైగ్రేన్, పేగు క్యాన్సర్, శ్వాస కోశ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. నువ్వుల నూనె తీసుకోవడం వల్ల డయాబెటీస్‌ కూడా కంట్రోల్ అవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.

విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు.! వీడియో వైరల్..
విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు.! వీడియో వైరల్..
అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత.. వివేక్ రామస్వామి హింట్.!
అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత.. వివేక్ రామస్వామి హింట్.!
భద్రకాళి చెరువు ఖాళీ. అబ్బో.. ఎన్ని రకాల చేపలో! అదిరిపోయే వీడియో
భద్రకాళి చెరువు ఖాళీ. అబ్బో.. ఎన్ని రకాల చేపలో! అదిరిపోయే వీడియో
మందు పార్టీ తరువాత ఘోరం.! రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన శరీరభాగాలు
మందు పార్టీ తరువాత ఘోరం.! రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన శరీరభాగాలు
ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంటి వేషంలో కార్లు నాశనం.! వీడియో..
ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంటి వేషంలో కార్లు నాశనం.! వీడియో..
ఫ్రీ డేటా, నో ఛార్జింగ్‌, టెస్లా.. ఇలాంటి ఫోన్లను తయారుచేస్తోందా?
ఫ్రీ డేటా, నో ఛార్జింగ్‌, టెస్లా.. ఇలాంటి ఫోన్లను తయారుచేస్తోందా?
రంగులు మారే శివలింగం.. ఎక్కడో తెలుసా.? వీడియో వైరల్..
రంగులు మారే శివలింగం.. ఎక్కడో తెలుసా.? వీడియో వైరల్..
భార్య నీతాకు అంబానీ కొత్త గిఫ్ట్.. ఏకంగా రూ.70 వేల కోట్లతో.!
భార్య నీతాకు అంబానీ కొత్త గిఫ్ట్.. ఏకంగా రూ.70 వేల కోట్లతో.!
వీటిని తింటే మీ స్టామినా డబుల్.! రోజు ఉదయం తింటే రాత్రికి..
వీటిని తింటే మీ స్టామినా డబుల్.! రోజు ఉదయం తింటే రాత్రికి..
12 ఏళ్ల చిన్నారికి గుండెపోటు.. ఇంట్లోనే ఒక్కసారిగా.! వీడియో
12 ఏళ్ల చిన్నారికి గుండెపోటు.. ఇంట్లోనే ఒక్కసారిగా.! వీడియో