Insurance: ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంటి వేషంలో కార్లు నాశనం.! వీడియో..

Insurance: ఇన్సూరెన్స్ కోసం ఎలుగుబంటి వేషంలో కార్లు నాశనం.! వీడియో..

Anil kumar poka

|

Updated on: Nov 20, 2024 | 5:19 PM

ఇన్సూరెన్స్ కంపెనీలను మోసగించేందుకు నలుగురు స్నేహితులు ప్రయత్నించారు. ఎలుగుబంటి వేషం వేసి ఖరీదైన కార్లను నాశనం చేశారు. బీమా డబ్బు కోసం ప్రయత్నించారు. అయితే దర్యాప్తు చేసిన అధికారులు అసలు గుట్టు రట్టు చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ సంఘటన జరిగింది. ఈ ఏడాది జనవరిలో లాస్ ఏంజిల్స్ సమీపంలోని పర్వత ప్రాంతమైన లేక్ యారోహెడ్‌లో పార్క్ చేసిన లగ్జరీ కారు రోల్స్ రాయిస్‌లోకి ఎలుగుబంటి ప్రవేశించింది. కారు లోపలి భాగాలు, సీట్లను ధ్వంసం చేసింది.

కారు యజమాని ఇన్సూరెన్స్ కోసం సంబంధిత కంపెనీకి దరఖాస్తు చేశాడు. ఎలుగుబంటి కారులో ఉన్నట్లుగా రికార్డైన సీసీటీవీ వీడియో క్లిప్‌, కారు సీటును ధ్వంసం చేసిన ఫొటోలను ఆధారాలుగా సమర్పించాడు. అయితే ఇన్సూరెన్స్‌ అధికారులు అనుమానించారు. కాలిఫోర్నియా వైల్డ్‌లైఫ్ డిపార్ట్‌మెంట్‌ను ఆశ్రయించారు. ఒక జీవశాస్త్రవేత్త ఆ వీడియో క్లిప్‌ను పరిశీలించారు. కారులో ప్రవేశించింది నిజమైన ఎలుగుబంటి కాదని నిర్ధారించారు. సీటుపై గోళ్లు ఆనవాళ్లు కూడా ఎలుగుబంటివి కావని చెప్పారు. ఎలుగుబంటి దుస్తులు ధరించిన వ్యక్తి పనిగా అనుమానించారు.

మరోవైపు అదే ప్రాంతంలో పార్క్‌ చేసిన మరో రెండు కార్లకు అదే ఎలుగుబంటి నష్టాన్ని కలిగించినట్లు వేర్వేరు బీమా కంపెనీలకు మరో రెండు క్లెయిమ్స్‌ అందినట్లు ఇన్సూరెన్స్ ఫ్రాడ్‌ అధికారులు తెలుసుకున్నారు. అదే వీడియో క్లిప్‌, ఫొటోలు సమర్పించినట్లు గ్రహించారు. ఒక వ్యక్తి ఇంట్లో సోదా చేయగా ఎలుగుబంటి దుస్తులు కనిపించాయి. దీంతో రూ.1.17 కోట్ల బీమా మోసానికి నలుగురు స్నేహితులు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో 26 ఏళ్ల రూబెన్ తామ్రాజియన్, 39 ఏళ్ల అరరత్ చిర్కినియన్, 32 ఏళ్ల వాహే మురద్ఖాన్యన్, 39 ఏళ్ల అల్ఫియా జుకర్‌మాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.