ఖాళీ కడుపుతో ఓ స్పూన్ కొబ్బరి తింటే ఏమౌతుందంటే..

Jyothi Gadda

20 November 2024

TV9 Telugu

కొబ్బరిలోని పోషకాల గురించి తెలిస్తే ప్రతిరోజూ తీసుకుంటారు. ముఖ్యంగా ఉదయాన్నే తింటే బాడీకి ఎన్నో పోషకాలు అందుతాయి. బరువు తగ్గడం నుంచి మరెన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.

TV9 Telugu

కొబ్బరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల గట్ బ్యాక్టీరియా‌కి సపోర్ట్ చేస్తుంది. జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం దూరమవుతుంది.

TV9 Telugu

కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి రోజు మొత్తానికీ సరిపడా ఎనర్జీని అందిస్తాయి. దీంతో పాటు మానసికంగా ఆనందంగా, షార్ప్‌గా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. 

TV9 Telugu

పిల్లలకి రెగ్యులర్‌గా కొబ్బరిని ఇస్తే చదువుల్లో ముందుంటారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కారణం, కొబ్బరి తినడం వల్ల బ్రెయిన్ హెల్తీగా మారుతుంది. అయితే, మోతాదులోనే ఇవ్వాలి.

TV9 Telugu

కొబ్బరిలో ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. దీని వల్ల కడుపు నిండుగా ఉంటుంది. క్రేవింగ్స్ తగ్గుతాయి. దీని వల్ల ఎక్కువగా తినరు. మొండి బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. 

TV9 Telugu

శరీరంలో వేడిని ఉత్పత్తి చేసి కేలరీలను బర్న్ చేసే ప్రక్రియను థర్మోజెనిసిస్ అంటారు. మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్‌తో దీనిని స్పీడ్ అప్ చేయొచ్చు. దీంతో త్వరగా బరువు తగ్గుతారు. 

TV9 Telugu

కొబ్బరిని స్నాక్‌లా తీసుకుంటే చాలా మంచిది. కొబ్బరిలో లారిక్ యాసిడ్ ఉంటుంది. అందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఇమ్యూనిటీని పెంచుతుంది. 

TV9 Telugu

కొబ్బరిలో హెల్దీ ఫ్యాట్స్ స్కిన్‌ని మాయిశ్చరైజ్,కోమలంగా చేస్తుంది. దీనికోసం ఉదయాన్నే తినాలి. కొబ్బరిలోని పోషకాలు ముఖ్యంగా ప్రోటీన్, ఐరన్ జుట్టుని పొడుగ్గా షైనీగా పెరిగేలా చేస్తుంది. 

TV9 Telugu