విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు.! వీడియో వైరల్..
సాఫీగా వెళుతున్న విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు. కొందరైతే ఏకంగా పైకప్పుకు గుద్దుకున్నారు. చేతుల్లో ఉన్న వస్తువులు, పైన పెట్టిన బ్యాగులు, ఎయిర్ హోస్టెస్ లు తీసుకొస్తున్న ఆహార పదార్థాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి.
ఉన్నట్టుండి విమానం కుదుపులకు లోనవడంతో ఏదో ప్రమాదం జరుగుతోందని భావించి, తాము చనిపోబోతున్నామని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. స్వీడన్ నుంచి ఫ్లోరిడాకు వెళుతున్న విమాన ప్రయాణికులకు ఈ భయానక అనుభవం ఎదురైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రయాణికులు, ఎయిర్ లైన్స్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. స్కాండినేవియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం గురువారం మధ్యాహ్నం స్వీడన్ లోని స్టాక్ హోం నుంచి ఫ్లోరిడాలోని మయామీకి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5:45 గంటలకు ఈ విమానం మయామీ లో దిగాల్సి ఉండగా.. మార్గమధ్యంలో ఎయిర్ టర్బులెన్స్ కారణంగా భారీ కుదుపులకు లోనైంది. ప్రయాణికులు సీట్లలో ఎగిరిపడడంతో పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి తిరిగి స్టాక్ హోమ్ లో దింపేశాడు. ఆపై ప్రయాణికులకు రాత్రి వసతి కల్పించి, మర్నాడు మరో విమానంలో మయామికి పంపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

