Andhra Pradesh: అయ్యో పాపం.. ఐదేళ్లకే ఆ బాలుడికి ఆయుష్షు తీరిపోయింది..!
భువనేశ్ అనే ఐదేళ్ల బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటూ మెట్ల పైనుంచి జారి పడ్డాడు. పైకి రక్తపు మరకలు, గాయాలు ఏమి కనిపించలేదు.
ఆ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు..! కొడుకును అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అల్లరి చేష్టలు చూసి ఆ దంపతులు మురిసిపోయేవారు. బాగా చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆశపడ్డారు. కుమారుడిపై ఎన్నో అశలు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారు. కానీ వారి పాలిట విధి కన్నెర్ర చేసింది. మెట్ల రూపంలో ఆ ఐదేళ్ల బాలుడుని మృత్యువు కాటేసింది..
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో హృదయవిదారకార ఘటన చోటు చేసుకుంది. నందిగామ డివిఆర్ కాలనీకి చెందిన పరిమి నరసింహారావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు భువనేశ్ ఉన్నారు. బాలుడి తండ్రి ఓ హోటల్‌లో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. తల్లి దినసరి కూలీ.. ఇద్దరి సంపాదనలతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈక్రమంలోనే ఆ దంపతుల ఐదేళ్ల కుమారుడు భువనేశ్‌ను ఇంటి వద్ద వదిలి పనులకు వెళ్లిపోయారు.
నవంబర్ 16న భువనేశ్ ఇంటి వద్ద ఆడుకుంటూ మెట్ల పైనుంచి జారి పడ్డాడు. పైకి రక్తపు మరకలు, గాయాలు ఏమి కనిపించలేదు. దింతో తల్లిదండ్రులు ఊపిరి పిల్చుకుని బాలుడిని అంగన్వాడి కేంద్రానికి పంపారు. అనంతరం మరుసటి రోజు బాలుడు తూలుతూ కనిపించాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన నందిగామలోని ప్రభుత్వ ఆసుపతికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి వెంటనే విజయవాడ పెద్దాసుపతికి తరలించాలని సూచించారు.
దీంతో వైద్యుల సూచనల మేరకు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చి దంపతులు ఆసుపత్రిలో బాలుడిని చేర్పించారు. బాలుడికి వైద్యపరీక్షలు జరిపి వైద్యులు శరీరం లోపలి అవయవాలు దెబ్బతిన్నట్లు, ఇందుకు అత్యవసర చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలుడిపై ఎన్నో అసలు పెట్టుకున్న తల్లి దండ్రులకు ఆశలు నిరాశలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..