ఈ బ్లడ్ గ్రూప్ వారికి ఎక్కువగా గుండెపోటు వచ్చే అవకాశం.. అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు..

| Edited By: Team Veegam

Mar 20, 2021 | 11:16 AM

మన శరీరంలో అతి ముఖ్యమైన అవయావాల్లో గుండె ఒకటి. ఇది బాడీ మొత్తానికి రక్తాన్ని సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ప్రతి అవయం చురుగ్గా

ఈ బ్లడ్ గ్రూప్ వారికి ఎక్కువగా గుండెపోటు వచ్చే అవకాశం.. అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు..
Heart Attack
Follow us on

మన శరీరంలో అతి ముఖ్యమైన అవయావాల్లో గుండె ఒకటి. ఇది బాడీ మొత్తానికి రక్తాన్ని సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ప్రతి అవయం చురుగ్గా పనిచేయడానికి సహయపడుతుంది. అయితే మారుతున్న జీవన విధానంతోపాటు ఇతర కారణాల వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి. దీంతో చాలా మంది మరణిస్తున్నారు. అయితే ఈ గుండె జబ్బులు నాన్ ఓ బ్లడ్ గ్రూప్ వాళ్లు జాగ్రత్తగా ఉండాలంటున్నవారు నిపుణులు.

ఇటీవల నిర్వహించిన ఓ అధ్యనయం ప్రకారం O బ్లడ్ గ్రూప్ లేని వ్యక్తులకు అత్యధిక సార్లు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని వెల్లడైంది. బ్రడ్ గ్రూప్ ప్రకారం గుండె జబ్బులు ఎలా వస్తున్నాయనేది విషయంపై అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA)లోని ఆర్టిరియోస్ల్కెరోసిస్, థ్రోంబోసిస్, వాస్కులర్ బయాలజీ అధ్యయాలను జరిపాయి. ఈ అధ్యయనాల్లో 40,000 మందికి పైగా ప్రజలలో A బ్లడ్ గ్రూప్, B బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి O బ్లడ్ గ్రూప్ ఉన్నవారి కంటే 8 శాతం ఎక్కువ ప్రమాదం ఉందని తేలింది. మరో అధ్యయనంలో 1.36 మిలియన్లకు పైగా ప్రజలను 2017లో యూరోపియన్ సోసైటీ ఆఫ్ కార్డియాలజీ చేసింది. ఇందులో O బ్రడ్ గ్రూప్ లేనివారు కొరోనరీ, గుండె సమస్యలతోపాటు గుండెపోటు 9 శాతం ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి తేలింది.

ప్రమాదాలు ఉన్న వ్యక్తులు..

పరిశోధనల ప్రకారం A బ్లడ్ గ్రూప్, B బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి, O బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి పోల్చారు. ఇందులో B బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి ఎక్కువగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వెల్లడైంది. ఇందులో O బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులతో పోలిస్తే.. B బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి మయోకార్డియల్ ఇన్ఫార్జన్ (గుండెపోటు) 15 శాతం వచ్చే అవకాశం ఉంది. అలాగే O బ్లడ్ గ్రూప్ ఉన్నవారితో పోలిస్తే.. A బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి గుండె ఆగిపోయే ప్రమాదం 11 శాతం పెరిగిందని.. వీరిలో క్రమంగా గుండె పోటు ఎక్కువయ్యే అవకాశాలున్నట్లు తేలింది. దీంతో ఆకస్మాత్తుగా గుండె ఆగిపోవడం జరుగుతుంది.

వీరికే ఎందుకు జరుగుతుంది…

యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ ప్రకారం O నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వారిలో గుండె పోటు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే వీరిలో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. నాన్ O బ్లడ్ గ్రూప్ ప్రజలు విల్లెబ్రాండ్ కానీ కారకం యొక్క అధిక సాంద్రతను కలిగి ఉన్నారని 2017 అధ్యయనంలో వెల్లడైంది. ఇది రక్తం గడ్డకట్టే ప్రోటీన్, ఇది థ్రోంబోటిక్ ముడిపడి ఉంది. A బ్లడ్ గ్రూప్, B బ్లడ్ గ్రూప్ ఉన్నవారు రక్తం గడ్డకట్టడం ఏర్పడే థ్రోంబోసిస్‏ను ఎదుర్కోనే అవకాశం 44 శాతం ఎక్కువగా ఉంటుంది. గుండెపోటులో రక్తం గడ్డకట్టడం ఎక్కువగా జరుగుతుంది. అవి కొరోనరీ ఆర్టరీని నిరోధించగలవు, ఆక్సిజన్, పోషకాలు గుండె కండరాల కోసం ప్రయత్నిస్తాయి. ఫలితంగా గుండెపోటు వస్తుంది.

Also Read:

Eggs Benefits: ఎండాకాలంలో గుడ్లు తినడం మంచిదేనా ? వేసవిలో ఎగ్స్ తినడం వల్ల సమస్యలు ఉంటాయా..

జస్‏ప్రీత్ బుమ్రా భార్య సంజన గణేశన్ ధరించిన లెహంగా చుశారా ? ఎక్కడో చూసినట్టు ఉంది కదూ..