Health Tips: వర్షాకాలంలో తప్పక తినాల్సిన పండ్లు.. ఆయా సమస్యలకు చక్కటి పరిష్కారం!

|

Jun 29, 2022 | 9:54 PM

ముఖ్యంగా ఆహారం విషయంలో కాస్త శ్రద్ధ వహిస్తే..వర్షకాలంలో రోగాల బారిన పడకుండా ఉండొచ్చని చెబుతున్నారు. వర్షాకాలంలో పలు రకాల పండ్లు, కూరగాయలు తింటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..

Health Tips: వర్షాకాలంలో తప్పక తినాల్సిన పండ్లు.. ఆయా సమస్యలకు చక్కటి పరిష్కారం!
కూరగాయలు, పండ్లు: ఫిట్‌గా ఉండాలనుకునే వరుడు.. ఎక్కువగా పండ్లు, ఆకు కూరగాయలను ఆహారంలో తీసుకోవాలి. వీటిని తినడం వల్ల శరీరానికి విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా అందుతాయి.
Follow us on

వచ్చేది వర్షాకాలం.. అంటువ్యాధులకు కూడా ఇది సీజనే. విపరీతంగా కురిసే వర్షాలు, కొత్త నీటితో చాలా మంది వివిధ రకాల వ్యాధుల బారినపడుతుంటారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి తరచూగా వెంటాడుతుంటాయి. కానీ వీటి నుంచి విముక్తి పొందడానికి కొన్ని జాగ్రత్తలు, చిట్కాలు పాటిస్తే వాటినుంచి సులువుగా తప్పించుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో కాస్త శ్రద్ధ వహిస్తే..వర్షకాలంలో రోగాల బారిన పడకుండా ఉండొచ్చని చెబుతున్నారు. వర్షాకాలంలో పలు రకాల పండ్లు, కూరగాయలు తింటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుందని సూచిస్తున్నారు.

వర్షాకాలంలో ముఖ్యంగా ఎరుపు కూరగాయలను ఎక్కువగా తినాలని చెబుతున్నారు. క్యారెట్, బొప్పాయి, బిట్టర్ గోర్డ్ క్యాప్సికమ్, మోసంబి, మామిడి, దానిమ్మ, స్ట్రాబెర్రీ తింటే చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు. అలాగే, ఆపిల్‌ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోజూ ఒక యాపిల్ తింటే అనేక వ్యాధులు నయమవుతాయి. ఉదయం పూట ఖాళీ కడుపుతో యాపిల్ తినడం వల్ల శక్తి పుష్కలంగా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆపిల్‌ పండ్లను క్రమం తప్పకుండా తింటే.. ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

వర్షాకాలంలో తినే ఆరోగ్యకరమైన కూరగాయలలో పొట్లకాయను తప్పక చేర్చాలని చెబుతున్నారు. ఎందుకంటే పొట్లకాయలో చాలా పోషక విలువలుంటాయి. పొట్లకాయల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. స్వల్పంగా ప్రొటీన్లు, పిండి పదార్థాలు కూడా కలిగి ఉంటుంది. ఇక విటమిన్లలో… విటమిన్‌–ఏ, బీటా కెరోటిన్, విటమిన్‌–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌–సి వంటివి పొట్లకాయలో లభిస్తాయి. వీటితో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. కావున వీటిని తినడం ద్వారా చాలా రకాల పోషక విలువ శరీరానికి లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

వర్షాకాలంలో జామున్ కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను అందిస్తుంది. నేరేడు కాయలు ఎన్నో అనారోగ్య సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఇందులో ఐరన్, పొటాషియం, ఫోలేట్, విటమిన్లు వంటి చాలా రకాల పోషకాలుంటాయి. కావున వీటిని తినడం వల్ల పొట్టలో సమస్యలు దూరమవుతాయి. నేరేడు పండ్లు తినగా మిగిలిన విత్తనం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నేరేడు పండ్ల గుజ్జు సారానికి క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. కాలేయంలో బైల్ జ్యూస్ ఉత్పత్తి తగ్గినప్పుడు కలిగే ఇబ్బందులను తొలగించటంలో నేరేడు పండ్లు సహాయకారిగా పనిచేస్తాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

వర్షాకాలంలో ముఖ్యంగా తినాల్సిన పండ్లలో రేగు పండ్లు కూడా ఎంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రేగు పండ్లలో విటమిన్ సి, ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో కేలరీలు చాలా తక్కువ ఉండడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ నియంత్రిస్తుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)