Remedies for Teeth: మీ దంతాలు తెల్లగా మెరిసి పోవాలా.. ఈ చిట్కాలు బెస్ట్!

|

Sep 17, 2024 | 1:06 PM

దంతాలు తెల్లగా ఉంటేనే చూడటానికి కూడా అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఎవరి ముఖంలో అయినా ముందుగా కనిపించేది దంతాలే. కాబట్టి ఆ దంతాలు తెల్లగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. దంతాలు తెల్లగా మెరుస్తూ ఉంటే ఆ లుక్కే వేరు. దంతాలు పసుపు పచ్చగా, మచ్చలుగా ఉంటే చాలా చిరాకుగా కనిపిస్తాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలా దంతాలపై పసుపు మరకలు ఉంటే..

Remedies for Teeth: మీ దంతాలు తెల్లగా మెరిసి పోవాలా.. ఈ చిట్కాలు బెస్ట్!
White Teeth
Follow us on

దంతాలు తెల్లగా ఉంటేనే చూడటానికి కూడా అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఎవరి ముఖంలో అయినా ముందుగా కనిపించేది దంతాలే. కాబట్టి ఆ దంతాలు తెల్లగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. దంతాలు తెల్లగా మెరుస్తూ ఉంటే ఆ లుక్కే వేరు. దంతాలు పసుపు పచ్చగా, మచ్చలుగా ఉంటే చాలా చిరాకుగా కనిపిస్తాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలా దంతాలపై పసుపు మరకలు ఉంటే.. నలుగురిలో నవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే నోటి నుంచి దుర్వాసన కూడా వస్తూ ఉంటుంది. చెడు ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా దంతాలు రంగు మారుతూ ఉంటాయి. మరి దంతాలను తెల్లగా, దుర్వాసన లేకుండా మార్చేలా చేయడంలో ఈ చిట్కాలు ఎంతో చక్కగా పని చేస్తాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

దంతాలను సరిగా తోముకోవాలి:

చాలా మంది ఎలా పడితే అలా దంతాలను తోమి వదిలేస్తారు. కేవలం ముందు దంతాలను శుభ్రం చేసుకుంటారు. లోపల, మూలల్లో క్లీన్ చేయదరు. దీని వల్ల దంతాలపై మురికి పేరుకుతుంది. ఇలాగే పసుపు రంగు, పసుపు పచ్చగా మారతాయి.

ఉప్పు వాటర్:

దంతాలు పసుపు రంగు, పసుపు పచ్చ రంగులోకి మారితే ఉప్పుతో‌ తెల్లగా మార్చుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే రాళ్లు లేదా సాల్ట్ తీసుకోండి. దీనితో పళ్లను బాగా రుద్దండి. ఆ తర్వాత నోట్లో ఉప్పు కలిపిన నోటితో పుక్కిలించండి. ఇలా చేయడం వల్ల దంతాలపై మురికిపోయి తెల్లగా ఉంటాయి. దుర్వాసన కూడా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

నిమ్మరసం – ఉప్పు:

ఉప్పులోనే నిమ్మరసం కూడా కలిపి ఉపయోగించవచ్చు. సాల్ట్‌లో కొద్దిగా నిమ్మరసం పిండి.. ఆ మిశ్రమంతో పళ్లను బాగా రుద్దండి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో పుక్కిలించండి. ఇలా చేస్తో మురికి, బ్యాక్టీరియా కూడా బయటకు పోతాయి.

త్రిఫల చూర్ణం:

త్రిఫల చూర్ణంతో కూడా దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. ఎక్కడైనా త్రిఫల చూర్ణం లభిస్తుంది. తిఫ్రల చూర్ణంలో నిమ్మరసం లేదా నీటిని కలిపి బ్రష్‌తో పళ్లను బాగా రుద్దండి. ఇలా చేయడం వల్ల పళ్లపై ఉండే పసుపు పచ్చ మరకలు పోయి.. తెల్లగా మారతాయి. బలంగా ఉంటాయి. బొగ్గుతో కూడా పళ్లను తోమితే మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..