New Year Gifts 2024: న్యూ ఇయర్‌కి బెస్ట్‌ గిఫ్ట్స్‌ ఇవే.. పక్కా వాస్తు.. సంపద మస్తు..

కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటారు. ప్రియమైన వారికి పలు రకాల బహుమతులు, గిఫ్ట్‌ కార్డులు, గ్రీటింగ్స్‌ అందిస్తుంటారు. ఇది ఆనవాయితీగా వస్తోంది. విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు, కుటుంబాలలో, స్నేహితులు, ప్రేమికులు ఇలా అందరికీ డిసెంబర్‌ 31రాత్రితో పాటు జనవరి ఒకటో తేదీ చాలా ప్రత్యేకమైనది. ఈ సమయంలో మీరు కూడా ఏదైనా సమ్‌ థింగ్‌ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని భావిస్తుంటే.. ఈ కథనం మీ కోసమే.

New Year Gifts 2024: న్యూ ఇయర్‌కి బెస్ట్‌ గిఫ్ట్స్‌ ఇవే.. పక్కా వాస్తు.. సంపద మస్తు..
Gift Ideas

Edited By:

Updated on: Dec 29, 2023 | 4:13 PM

మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. పాత క్యాలెండర్లు డస్ట్‌ బిన్‌లో వేసి, కొత్త ‍క్యాలెండర్లు గోడపైకి చేర్చేస్తాం. కొత్త ఆకాంక్షలు రెక్కలు తొడుగుతాయి. కొత్త సంకల్పాలు పురివిప్పుతాయి. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటారు. ప్రియమైన వారికి పలు రకాల బహుమతులు, గిఫ్ట్‌ కార్డులు, గ్రీటింగ్స్‌ అందిస్తుంటారు. ఇది ఆనవాయితీగా వస్తోంది. విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు, కుటుంబాలలో, స్నేహితులు, ప్రేమికులు ఇలా అందరికీ డిసెంబర్‌ 31రాత్రితో పాటు జనవరి ఒకటో తేదీ చాలా ప్రత్యేకమైనది. ఈ సమయంలో మీరు కూడా ఏదైనా సమ్‌ థింగ్‌ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని భావిస్తుంటే.. ఈ కథనం మీ కోసమే. ఏదో గిఫ్ట్‌ ఇచ్చాం అని కాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం బహుమతి ఇస్తే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సారి ట్రై చేయండి. వాస్తు ప్రకారం మీ ప్రియమైన వారికి ఎలాంటి బహుమతులు ఇవ్వొచ్చు? బెస్ట్‌ వాస్తు గిఫ్ట్ ఐడియాస్ మీకోసం..

వినాయకుడి విగ్రహం..

సంవత్సరం ప్రారంభం రోజు అవిఘ్నమస్తు అని దీవిస్తూ విఘ్నాలను హరించే విఘ్నేశ్వరుడి ప్రతిమను బహుమతిగా ఇవ్వడం కన్నా మించిన బహుమతి ఇంకోటి ఎక్కడ ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం సంవత్సరాన్ని విఘ్నేశ్వరుడితో ప్రారంభిస్తే మంచిదని పండితులు సైతం చెబుతుంటారు. అందుకే మీరు ఎవరికైనా న్యూ ఇయర్‌ రోజున కానుకలు ఇవ్వాలకుంటే చిన్న వినాయకుడి బొమ్మను ఇవ్వొచ్చు. లేదా మీరు బహుమతిగా తీసుకోవచ్చు.

శ్రీమేరు యంత్రం..

పండితులు చెబుతున్న దాని ప్రకారం వాస్తు యంత్రాల్లో అత్యంత శక్తిమంతమైనది ఈ శ్రీమేరు యంత్రం. దీని వల్ల ఎన్నో లాభాలు వస్తాయి. సంపద, శ్రేయస్సు, అదృష్టం కలిసివస్తుంది. ఈ యంత్రం ద్వారా పరిసరాల ప్రతికూలతలు తొలగుతాయి. ఆహ్లాదకరమైన వాతావరణం ఇంట్లో సమకూరుతుంది. ఇంట్లో అనవసర చీకటిని తొలగిస్తుందని పండితులు చెబుతారు.

తాబేలుతో కూడిని ఏనుగు బొమ్మ..

ఏనుగు జ్ఞానం, శౌర్యం, విజయానికి ప్రతీక. ఇది అదృష్టం, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. అలాగే తాబేలు చెడు శక్తును తరిమేసి, శ్రేయస్సును, ఆనందాన్నిస్తుంది. ఈ రెండూ కలిసినప్పుడు వ్యక్తులు దీర్ఘాయువుతో పాటు జ్ఞానాన్ని పొందుకుంటారని చెబుతారు.

లాఫింగ్‌ బుద్దా..

లాఫింగబుద్ధా శ్రేయస్సు, సంపదకు సూచిక. ఇది బహుమతిగా ఇచ్చే వారికి, స్వీకరించే వారికి అపారమైన అదృష్టాన్ని తెస్తాయని నమ్ముతారు. అలాగే అందమైన గృహాలంకరణగా కూడా ఇది ఉపయోగపడుతోంది. ఇంట్లో ఆరు రకాల లాఫింగ్‌ బుద్ధాలు పెట్టుకునే వారుంటారు. వీటి వల్ల శుభం కలుగుతుందట.

గోమతి చక్ర వృక్షం..

ఈ చెట్టు ఇంటికి అదృష్టమని భావిస్తారు. కొంతమంది దీనిని ఇంటి పునాదిలో పాతిపెడతారు. దీనిని బహుమతిగా ఇస్తే సంపద, మంచి ఆరోగ్యం చేకూరుతుందని చెబుతారు.

వాస్తుకు అనుకూలమైన వాటర్‌ ఫౌంటేన్‌..

వాస్తు శాస్త్రం ప్రకారం ప్రవహించే నీరు సంపద, సమృద్ధికి సంకేతం. సంపద జోన్‌లో నీటి ఫౌంటేన్‌ ఉంచడం వల్ల డబ్బును అది ఆహ్వానిస్తుంది. అలాగే నీటి ప్రవాహ శబ్దం ఇంద్రియాలను శాంతపరుస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..