Kids health: మీ పిల్ల‌ల్లో ఈ ల‌క్ష‌ణాలున్నాయా.? క‌డుపులో నులి పురుగులు ఉన్న‌ట్లే..

క‌డుపులో నులి పురుగ‌ల స‌మ‌స్య ఉంటే చిన్నారులు ఆహారాన్ని తీసుకోవ‌డానికి పెద్ద‌గా ఆసక్తి చూపించ‌రు. అలాగే ఆహారం తీసుకున్నా బరువు త‌గ్గుతుంటారు. అలాగే చిన్నారుల‌కు మ‌ల ద్వారంలో దుర‌ద‌గా ఉంటుంది. రాత్రుళ్లు నిద్రకు దూర‌మ‌వుతుంటారు. చిన్నారుల్లో చాలా కాలంగా నిద్ర‌లేమి స‌మ‌స్య ఎదుర‌వుతుంటే...

Kids health: మీ పిల్ల‌ల్లో ఈ ల‌క్ష‌ణాలున్నాయా.? క‌డుపులో నులి పురుగులు ఉన్న‌ట్లే..
Kids Health
Follow us

|

Updated on: Aug 02, 2024 | 6:07 PM

చిన్నారులు త‌ర‌చూ ఎదుర్కొనే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో నులిపురుగులు ఒక‌టి. ఇది చిన్నారుల ఆరోగ్యంపై చాలా ప్ర‌భావం చూపుతుంది. క‌డుపులో నులి పురుగులు ఉండ‌డం వ‌ల్ల ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తాయి. స‌హ‌జంగానే చిన్న పిల్ల‌లు త‌మ‌కు ఏం జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్పుకోలేరు. అందుకే ఈ స‌మ‌స్య‌ను అంత సుల‌భంగా గుర్తించ‌లేము. అయితే కొన్ని ల‌క్ష‌ణాల ద్వారా చిన్నారుల్లో నులి పురుగుల స‌మ‌స్య ఉన్న‌ట్లు తెలుసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇంత‌కీ క‌డుపులో నులి పురుగులు ఉంటే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

క‌డుపులో నులి పురుగ‌ల స‌మ‌స్య ఉంటే చిన్నారులు ఆహారాన్ని తీసుకోవ‌డానికి పెద్ద‌గా ఆసక్తి చూపించ‌రు. అలాగే ఆహారం తీసుకున్నా బరువు త‌గ్గుతుంటారు. అలాగే చిన్నారుల‌కు మ‌ల ద్వారంలో దుర‌ద‌గా ఉంటుంది. రాత్రుళ్లు నిద్రకు దూర‌మ‌వుతుంటారు. చిన్నారుల్లో చాలా కాలంగా నిద్ర‌లేమి స‌మ‌స్య ఎదుర‌వుతుంటే వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాలి. అలాగే చిన్నారులు నిత్యం క‌డుపు నొప్పి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నా నులి పురులతో బాధ‌ప‌డుతున్నట్లు అర్థం చేసుకోవాలి. అలాగే వాంతులు అవుతున్నా, వికారంగా ఉంటున్నా నిత్యం.. క‌డుపునొప్పి, తిమ్మిరి వంటి స‌మ‌స్య‌ల‌తో పాటు అతిసారం వంటి ల‌క్ష‌ణాలు కనిపిస్తాయి. తల తిరగడం, తలనొప్పి, అలసట, బలహీనత వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

పిల్ల‌లు ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌కుండా ఉండాలంటే బాత్‌రూమ్‌కు వెళ్లిన‌ప్పుడ‌ల్లా చేతుల‌ను శుభ్రంగా క‌డుక్కోవాలి. పిల్లలు మట్టి తినకుండా లేదా నోటిలో మురికిని పెట్టకుండా చూసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వారి క‌డుపులోకి బ్యాక్టీరియా వెళ్లే అవ‌కాశం ఉంటుంది. మాంసం, చేపలు, గుడ్ల‌ను బాగా ఉడికించిన త‌ర్వాతే అందించారు. తీసుకునే నీరు విష‌యంలో కూడా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. కాచి చ‌ల్లార్చిన నీటిని అందించాలి.

నోట్‌: పైన తెలిపిన విష‌యాలు కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు మాత్ర‌మే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచ‌న‌లు పాటించ‌డ‌మే ఉత్త‌మం.

మ‌రిన్ని లైఫ్ స్టైల్ వార్త‌ల కోసం క్లిక్ చేయండి..