BP: సెడన్‌గా బీపీ డౌన్‌ కావడానికి.. అసలు కారణం ఏంటో తెలుసా.?

మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల రక్తపోటు సంబంధిత సమస్యల బారినడపుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఓవైపు అధికరక్తపోటుతో ఇబ్బంది పడుతున్న వారు కొందరైతే లోబీపీతో బాధపడుతున్న వారు మరికొందరు. అయితే హైబీపీ ఎంత ప్రమాదమో, లో బీపీ కూడా అంతే ప్రమాదకరమని నిపుణులు చెబుతుంటారు...

BP: సెడన్‌గా బీపీ డౌన్‌ కావడానికి.. అసలు కారణం ఏంటో తెలుసా.?
Low Bp
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 12, 2024 | 9:30 PM

మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల రక్తపోటు సంబంధిత సమస్యల బారినడపుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఓవైపు అధికరక్తపోటుతో ఇబ్బంది పడుతున్న వారు కొందరైతే లోబీపీతో బాధపడుతున్న వారు మరికొందరు. అయితే హైబీపీ ఎంత ప్రమాదమో, లో బీపీ కూడా అంతే ప్రమాదకరమని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఈ సమస్య బారినపడుతుంటారు. అయితే లోబీపీ రావడానికి ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా తీసుకునే ఆహారంలో మార్పులు, జీవనశైలిలో మార్పుల కారణంగా లోబీపీ బారినపడే వారి సంఖ్య పెరుగుతుంది. సరిగ్గా తినకపోవడం, తీసుకునే ఆహారంలో తగినంత ఉప్ప లేకపోవడం వంటివి లోబీపీకి కారణమవుతుందని మనకు తెలిసిందే. అయితే మరికొన్ని ప్రధాన కారణాల వల్ల కూడా లోబీపీ సమస్య వేధిస్తుందని అంటున్నారు.

అడ్రినల్ గ్రంథి సరిగా పనిచేయకపోతే రక్తపోటు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అడ్రినల్‌ గ్రంథి కార్టికో, మినెరలో కార్టికో స్టిరాయిడ్లను ఉత్పత్తి చేస్తుంది. వీటి మోతాదులు తగ్గితే బీపీ పడిపోయే అవకాశం ఉంటుంది. శరీరంలో సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉన్నపలంగా తగ్గినా లోబీపీ వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ధమనుల్లో పూడికలు ఉంటే పరీక్షల్లో లోబీపీ చూపించే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఇక గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారిలో కూడా బీపీ తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సమస్య చాలా అరుదుగా కనిపిస్తుందని అంటున్నారు. ఎప్పటికప్పుడు బీపీని చెక్‌ చేసుకోవడం, క్రమం తప్పకుండా నీరు తాగడంతో పాటు వాకింగ్.. వ్యాయామాలు చేయడం వల్ల లోబీపీ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?
హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?
ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?
అద్భుత సంజీవని మునగాకు.. ప్రత్యేకించి మగవాళ్ళకి స్పెషల్.!
అద్భుత సంజీవని మునగాకు.. ప్రత్యేకించి మగవాళ్ళకి స్పెషల్.!