Health: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? చక్కెర ఎక్కువగా తింటున్నట్లే..

మనం తీసుకునే ఆహారంలో మార్పులు కారణంగా ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉప్పు ఎక్కువైనా, కారం ఎక్కువైనా వెంటనే మార్పులు కనిపిస్తాయి. మరి తీసుకునే ఆహారంలో చక్కెర ఎక్కువైతే శరీంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా.? చక్కెర ఎక్కువగా తీసుకుంటే..

Health: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? చక్కెర ఎక్కువగా తింటున్నట్లే..
Sugar
Follow us

|

Updated on: Oct 04, 2024 | 7:30 PM

మనం తీసుకునే ఆహారంలో మార్పులు కారణంగా ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉప్పు ఎక్కువైనా, కారం ఎక్కువైనా వెంటనే మార్పులు కనిపిస్తాయి. మరి తీసుకునే ఆహారంలో చక్కెర ఎక్కువైతే శరీంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా.? చక్కెర ఎక్కువగా తీసుకుంటే.. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని మనకు తెలిసిందే. అయితే మనం చక్కెర ఎక్కువగా తీసుకుంటున్నట్లు వెంటనే మన శరీరం మనల్ని అలర్ట్ చేస్తుంది. ఇంతకీ చక్కెర ఎక్కువగా తీసుకుంటున్నట్లు తెలిపే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* షుగర్‌ కంటెంట్‌ ఎక్కువైతే శరీరంలో శక్తిలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. చక్కెర ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. దీనివల్ల శరీరంలో ఒక్కసారిగా శక్తి పెరుగుతుంది. అయితే ఆ తర్వాత వెంటనే చక్కెర స్థాయిలు వేగంగా పడిపోతాయి. దీంతో అలసట, చిరాకు వంటివి వేధిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

* బరువు పెరుగుతున్నట్లు అనిపిస్తుంటే మీరు చక్కెర ఎక్కువగా తీసుకుంటున్నట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ చక్కెరను తీసుకున్నప్పుడు మన శరీరం ఎక్కువ కేలరీలను కొవ్వుగా నిల్వ చేస్తుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.

* దంతాల ఆరోగ్యం దెబ్బ తింటున్నా చక్కెర ఎక్కువగా తీసుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. ఎక్కువ చక్కెర తినడం వల్ల దంతాలు పుచ్చిపోతాయి. ఎక్కువ చక్కెరను తిన్నప్పుడు, మన నోటిలోని బాక్టీరియా చక్కెరను యాసిడ్‌గా మారుస్తుంది, ఇది మన దంతాలను దెబ్బతీస్తుంది.

* చక్కెర ఎక్కువగా తినడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. మనం ఎక్కువ చక్కెరను తిన్నప్పుడు, మన శరీరం ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల మొటిమలతో పాటు ఇతర చర్మ సమస్యలు వస్తాయి.

* చక్కెర ఎక్కువగా తినడం వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది. చక్కెర ఎక్కువగా తీసుకుంటే.. మన షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి, పడిపోతాయి. దీనివల్ల త్వరగా అలసిపోతారు.

* శరీరంలో పలు చోట్ల వాపు కనిపిస్తే చక్కెర ఎక్కువగా తీసుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. ఇది ధమనులను దెబ్బ తీస్తుంది, ఇది గుండె ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..