Mental Health: మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరిచే సూపర్ ఫుడ్స్ ఇవే!

మానసిక ఆరోగ్యం.. స్థిమితంగా ఉంటేనే ఇతర పనులపై కూడా దృష్టిని కేంద్రీకరించవచ్చు. మెంటల్ హెల్త్ స్టేబుల్ లేకపోతే.. ఏకాగ్రత అనేదే నశిస్తుంది. దీంతో ఏ పనినీ సరిగ్గా పూర్తి చేయలేం. కేవలం శరీర ఆరోగ్యం, జ్ఞానంపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపితే.. అనేక విజయాలను సాధించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మానసికంగా ఆరోగ్యంగా, యాక్టీవ్‌గా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు. మెంటల్ హెల్త్ సరిగ్గా లేనందు వల్లే చాలా మంది..

Mental Health: మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరిచే సూపర్ ఫుడ్స్ ఇవే!
Mental Health

Edited By:

Updated on: Feb 14, 2024 | 2:39 PM

మానసిక ఆరోగ్యం.. స్థిమితంగా ఉంటేనే ఇతర పనులపై కూడా దృష్టిని కేంద్రీకరించవచ్చు. మెంటల్ హెల్త్ స్టేబుల్ లేకపోతే.. ఏకాగ్రత అనేదే నశిస్తుంది. దీంతో ఏ పనినీ సరిగ్గా పూర్తి చేయలేం. కేవలం శరీర ఆరోగ్యం, జ్ఞానంపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపితే.. అనేక విజయాలను సాధించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మానసికంగా ఆరోగ్యంగా, యాక్టీవ్‌గా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు. మెంటల్ హెల్త్ సరిగ్గా లేనందు వల్లే చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. కానీ దృఢమైన సంకల్పం ఉంటే ఆత్మ హత్యను కూడా ఎదుర్కొనవచ్చని వెల్లడిస్తున్నారు. మీ మానసిక ఆరోగ్యం మెరుగు పడాలంటే ఈ ఆహార పదార్థాలు మీకు సహాయం చేస్తాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

కివీ ఫ్రూట్స్:

కివీ ఫ్రైట్స్‌లో విటమిన్ సితో పాటు అనేక పోషకాలు ఉంటాయి. కివీ తినడం శరీరం, చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మెంటల్ హెల్త్ కూడా మెరుగు పడుతుందని ఇటీవల జరిగిన అధ్యయనంలో తేలింది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవాలంటే.. కొద్ది రోజుల పాటు ప్రతి రోజూ కివీ తినడాన్ని అలవాటు చేసుకోండి. ఆ తర్వాత వచ్చే మార్పును మీరే గమనిస్తారు.

డ్రై ఫ్రూట్స్:

డ్రై ఫ్రూట్స్‌ తినడం వల్ల శరీర ఆరోగ్యాన్నే కాకుండా మెంటల్ హెల్త్‌ని కూడా మెరుగు పడుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగు పడటానికి బాదం, వాల్ నట్స్ బాగా సహాయ పడతాయి. వీటిల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అధికంగా ఉంటాయి. అలాగే ఈ నట్స్ జ్ఞాపకశక్తిని పెంచేందుకు కూడా సహాయ పడతాయి.

ఇవి కూడా చదవండి

చేపలు:

చేపలు తినడం వల్ల కూడా మానసిక ఆరోగ్యం బావుంటుంది. ఈ పోషకాలు మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చేపల్లో కూడా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభ్యమవుతాయి. బ్రెయిన్‌లో రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. మతి మరుపు, బ్రెయిన్ సంబంధిత సమస్యలు తగ్గించేందుకు ఓమేగా 3 హెల్ప్ చేస్తుంది.

బెర్రీస్:

బెర్రీస్ జాతికి చెందిన పండ్లను తినడం వల్ల కూడా మెదడు కార్యకలాపాలు మెరుగు పడతాయి. ఇవి మంద బుద్ధిని, మతిమరపును తగ్గించి.. మెదడు యాక్టీవ్ చేసేలా చేస్తాయి. చిన్న పిల్లలకు ఈ ఫ్రూట్స్ పెడితే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ పండ్లు తినే వారిలో మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.