Lifestyle: మంచిదని పిస్తా తెగ తింటున్నారా.? డేంజర్ అంటున్న నిపుణులు..
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తాయో ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా పిస్తాలో ఉన్న ఎన్నో మంచి గుణాలు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని పిస్తాను ఎక్కువగా తీసుకుంటే మాత్రం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు..

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తాయో ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా పిస్తాలో ఉన్న ఎన్నో మంచి గుణాలు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని పిస్తాను ఎక్కువగా తీసుకుంటే మాత్రం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ పిస్తాను అధికంగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* పిస్తాను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందిని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిస్తాపప్పులు ప్రోటీన్‌కు పెట్టింది పేరు. రక్తంలో ప్రోటీన్ స్థాయిలు పెరగడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. కిడ్నీ సమస్యలు ఉన్న వారు పిస్తాకు ఎంత దూరంగా ఉంటే మంచి మంచిదని చెబుతున్నారు.
* ఇక డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు కూడా పిస్తా తినడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. పిస్తా తినడం శరీరానికి హానికరం. కాబట్టి షుగర్ వ్యాధితో బాధపడే వారు పిస్తాలను తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
* పలు రకాల చర్మ అలర్జీలతో బాధపడే వారుకూడా పిస్తాకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పిస్తాలు అధికంగా తీసుకుంటే.. చర్మంపై దద్దుర్లు, దురదలు, ఎర్రటి మచ్చలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
* పిస్తాలను మోతాదుకు మించి తీసుకుంటే రక్తపోటు స్థాయిల్లో తేడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తంలో సోడియం స్థాయి పెరగడానికి ఇది కారణం కావొచ్చు. పిస్తాతో అస్పష్టమైన దృష్టి, మైకం, మూర్ఛ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
* పిస్తాలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణాశయానికి మేలు చేస్తుంది. అయితే మోతాదుకు మించి తీసుకోవడం వల్ల మాత్రం ఇబ్బంది తప్పదని నిపుణులు చెబుతున్నారు. విరేచనాలు, తిమ్మిర్లు, కడుపు నొప్పి, పేగు నొప్పి వంటి సమస్యలు తప్పవని చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




