AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food: మీక్కూడా పెరుగు, చక్కెర కలిపి తినే అలవాటు ఉందా.?

చక్కెర, పెరుగు కలుపుకొని తింటే ఆరోగ్యానికి మంచిదని మనందరికి తెలిసిందే. శరీరం చలువ చేస్తుందని, జీర్ణక్రియ మెరుగవుతుందని చాలా మంది పెరుగులో చక్కెర కలుపుకొని తీసుకుంటుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందనడంలో ఎంత నిజం ఉందో, కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు సైతం దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు...

Food: మీక్కూడా పెరుగు, చక్కెర కలిపి తినే అలవాటు ఉందా.?
Curd With Sugar
Narender Vaitla
|

Updated on: Jun 22, 2024 | 12:32 PM

Share

చక్కెర, పెరుగు కలుపుకొని తింటే ఆరోగ్యానికి మంచిదని మనందరికి తెలిసిందే. శరీరం చలువ చేస్తుందని, జీర్ణక్రియ మెరుగవుతుందని చాలా మంది పెరుగులో చక్కెర కలుపుకొని తీసుకుంటుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందనడంలో ఎంత నిజం ఉందో, కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు సైతం దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందకీ పెరుగు, చక్కెర కలుపుకొని తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ప్రతీరోజూ పెరుగు, పంచదార కలుపుకొని తీసుకుంటే శరీరంలో కొవ్వు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చక్కెరలో ఉండే అధిక క్యాలరీలే దీనికి కారణంగా చెప్పొచ్చు. ఇది ఊబయాకంతో పాటు మరెన్నో సమస్యలకు దారి తీస్తుంది.

* చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. లాక్టోస్ సహజంగా పెరుగులో ఉంటుంది, ఇది ఒక రకమైన చక్కెర. దీంతో చక్కెర కలుపుకొని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరిగే ప్రమాదం ఉంటుంది.

* చక్కెర ఎక్కువగా తినడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌తో పాటు ఇతర హానికరమైన కొవ్వుల స్థాయి పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి గుండె ఆరోగ్యం కాపాడుకోవాలంటే చక్కెర, పెరుగు కలిపి తీసుకోవడాన్ని తగ్గించాలి.

* పెరుగులో చక్కెర కలిపి తింటే దంతాలు పుచ్చిపోతాయి. చక్కెర బ్యాక్టీరియాకు ప్రధాన మూలంగా చెప్పొచ్చు. ఇది యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది, దీంతో దంతాలను దెబ్బతీస్తుంది.

* చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ చెడిపోతుంది. దీని కారణంగా, ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ప్రతిరోజూ చక్కెరను ఎక్కువ పరిమాణంలో తినకూడదు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్