Sleep: ఇదిగో ఈ తప్పులే మీ నిద్రలేమికి కారణాలు.. ఇలా చేస్తే సమస్య ఫసక్

ఇటీవల చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మారిన జీవన విధానం కారణంగా నిద్రలేమి సమస్యతో బారిన పడుతున్నారు. అయితే మనకు తెలిసో, తెలియకో చేసే కొన్ని తప్పులే ఈ నిద్రలేమికి కారణమని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Sleep: ఇదిగో ఈ తప్పులే మీ నిద్రలేమికి కారణాలు.. ఇలా చేస్తే సమస్య ఫసక్
Sleepless
Follow us

|

Updated on: Oct 17, 2024 | 1:46 PM

కడుపు నిండా ఆహారం.. కంటి నిండా నిద్ర.. ఆరోగ్యంగా ఉండడానికి అత్యంత ముఖ్యమైనవి. సరిపడ నిద్రలేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. నిద్రలేమి సమస్య కారణంగా గుండెపోటు మొదలు ఎన్నో మానసిక సస్యలకు సైతం దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే నిద్రలేమి సమస్యకు మనం చేసే కొన్ని తప్పులే కారణమని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* మనలో చాలా మంది ఇష్టం వచ్చిన సమయంలో పడుకొని ఇష్టం వచ్చిన సమయంలో లేస్తుంటారు. అయితే అలా కాకుండా కచ్చితంగా ఒక ఫిక్స్‌డ్‌ టైమ్‌ను సెట్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఉదయం ఒకే సమయానికి లేవడం వల్ల ఒక రకమైన లైఫ్‌స్టైల్‌ అలవాటు పడుతుంది. ఇది క్రమేణ నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.

* తిన్న వెంటనే పడుకునే అలవాటును పూర్తి మానుకోవాలి. తిన్న వెంటనే పడుకుంటే కడుపులో గందగరోళంగా ఉంటుంది. ఇది నిద్రలేమికి దారి తీస్తుంది. అందుకే నిద్రపోయే ముందు కనీసం రెండు గంటల ముందే భోజనం చేయాలి.

* ఇక ఆల్కహాల్‌ సేవిస్తే బాగా నిద్ర వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇందులో నిజం లేదు. తాగిన వెంటనే మత్తుగా నిద్ర వచ్చినట్లు అనిపించినా తెల్లవార్లు నిద్రకు భంగం కలుగుతుంది. ఇది నిద్రలేమికి దారి తీస్తుందని అంటున్నారు.

* అలాగే ఆకలితో పడుకున్న నిద్రకు భంగం కలుగుతుంది. కాబట్టి మరీ ఎక్కువ కాకుండా, మరీ తక్కువ కాకుండా కచ్చితంగా పడుకునే ముందు భోజనం చేయాలి.

* రాత్రి పడుకునే ముందు కాఫీ, టీ తాగడాన్ని పూర్తిగా మానేయ్యాలి. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. నాణ్యమైన నిద్రకు దూరమై ఆ ప్రభావం ఉదయం అంతా పడుతుంది.

* రాత్రుళ్లు పడుకునే ముందు స్మార్ట్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లతో కుస్తీలు పడడం కూడా మానుకోవాలి. రాత్రుళ్లు స్క్రీన్స్‌ నుంచి వచ్చే బ్లూ లైట్‌ నిద్రపై ప్రభావం చూపుతుంది.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..